మెగాస్టార్ చిరంజీవి సోదరుడుగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అతి తక్కువ కాలంలోనే అనేక విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరో స్థానానికి వెళ్లిపోయాడు. ఇలా టాప్ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే పవన్ కళ్యాణ్ 2014 వ సంవత్సరం జనసేన అనే రాజకీయ పార్టీ ని స్థాపించాడు. ఇక 2019 వ సంవత్సరం ఈ పార్టీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలోకి దిగింది.

పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తున్నప్పుడు ఆయనను అభిమానించే చాలా మంది వ్యక్తులు ఆయన జనసేన పార్టీ స్థాపించ గానే ఆయన సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీ లో చేరారు. అలాగే ఆయన గెలుపు కోసం వారు అనేక పనులను కూడా చేశారు. 2019 వ సంవత్సరం పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోవడం , అలాగే ఆ పార్టీ మొత్తం కలిపి కేవలం ఒకే ఒక్క స్థానాన్ని దక్కించుకోవడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డీలా పడిపోయాడు.

ఆయనను అభిమానించే జనసైనికులు కూడా అంతే స్థాయిలో నిరాశ చెందారు. ఇక 2024 వ సంవత్సరం అలా జరగకూడదు అనే ఉద్దేశంతో పవన్ అనేక ప్రణాళికలను చేస్తూ ఉంటే జనసైనికులు కూడా ఆయనకు మద్దతు ఇస్తూనే వచ్చారు. ఇక కొన్ని రోజుల క్రితమే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. ఇందులో జనసేన పార్టీ తెలుగు దేశం , బీజేపీ లతో కలిసి పొత్తులో భాగంగా పోటీలోకి దిగాయి.

ఈ పొత్తును కూడా జన సైనికులు స్వాగతించారు. పవన్ కచ్చితంగా ఈ సారి గెలవాలి. అలాగే జనసేన పార్టీ కి కూడా మంచి గుర్తింపు రావాలి అని జనసైనికులు భావిస్తున్నారు. మరి పోయినసారి పవన్ తో పాటు జనసైనికులు కూడా రిజల్ట్ తో చాలా నిరుత్సాహపడ్డారు. అలాంటి పరిస్థితులు ఈ సారి ఎన్నికల్లో జరగకూడదు అని జన సైనికులు భావిస్తున్నారు. మరి పవన్ ఈ సారి వారి కోరికను ఏ స్థాయిలో నెరవేరుస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: