ఆంధ్రప్రదేశ్లోని ప్రజల పరిస్థితి ఇప్పుడు ఎలా మారిపోయింది అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి సంబంధించిన వాటిని పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డ్వాక్రా మహిళలకు ఒక ఫంక్షన్స్ స్కీమ్ ఉండేది. సాధారణంగా పెన్షన్ అప్పట్లో 65 ఏళ్లకు ఇచ్చేవారు. డ్వాక్రా మహిళలకు 60 ఏళ్లకే పెన్షన్ ఇచ్చేవారు. అందుకుగాను ప్రతినెల ఇంత అని కొంత మొత్తం కట్ చేసుకునేవారు. 18 నుంచి 60 ఏళ్ల మహిళలకు అప్పట్లో ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది.


ప్రతి ఏడాది రూ.365 రూపాయలు చెల్లిస్తే చాలు రాష్ట్ర ప్రభుత్వం చొప్పున మరో రూ .365 రూపాయలు జమ చేసి.. వారికి 60 ఏళ్ళు నిండిన తర్వాత నెలకురూ .500 రూపాయల చొప్పున పింఛని ఇస్తామని అప్పట్లో ప్రకటించారు.. 2013, 14 తరువాత ఇందులో ఈ నమోదును సైతం ఆపివేయడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది లక్షల మంది వాటాదారులు ఉన్నారట. లబ్ధిదారులు ప్రభుత్వ వాటా కలిపి 2021 నాటికి 2000 వంద కోట్ల రూపాయలు చేరింది. ఈ మొత్తాన్ని జగన్ సర్కార్ క్యాష్ తీసేసుకుందని ఆ డబ్బు మొత్తం ఎల్ఐసి దగ్గర ఉండేవట.


డ్వాక్రా మహిళలకు ప్రభుత్వమే రూ .500 రూపాయలు కడుతూ ఉండేది.. ఆ డబ్బును ఏం చేశారు అంటే సెర్ప్ పరిధిలోని ప్రత్యేకమైన ఖాతాలో ఉంచినట్టు అప్పట్లో జగన్ సర్కార్ కూడా తెలియజేసింది. అయితే 60 ఏళ్లకే పెన్షన్ విధానాన్ని తీసుకురావడం జగన్ జరిగింది.. దీంతో ఈ రూ.500 రూపాయల పెన్షన్ ని డ్వాక్రా మహిళలకు ఆపివేశారు. ప్రస్తుతం ఈ డబ్బులను సిస్టం నుంచి తప్పించేశారు కాబట్టి .. వాస్తవానికి ఈ డబ్బులను వెనక్కి విచ్చేయాలి.. ఈ డబ్బులను ఇవ్వలేదంటూ కూడా ప్రముఖ వార్తాపత్రిక ప్రకటించడం జరిగింది. మరి ఈ విషయం పైన జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: