ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ కల్కి సెకండ్ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఎట్టకేలకు రిలీజ్ ట్రైలర్ విడుదలైంది. న భూతో న భవిష్యత్ అనేలా నాగ్ అశ్విన్ కేక పెట్టించారుగా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎన్నో ప్రత్యేకతలతో ఉన్న రిలీజ్ ట్రైలర్ ఫ్యాన్స్ అంచనాలను మించి ఆకట్టుకుంటోంది. కల్కి 2898 ఏడీ టికెట్ల కోసం ఊహించని స్థాయిలో పోటీ ఉండబోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
మూడు ప్రపంచాలను చూపిస్తూ దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రేక్షకులను మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సినిమా మాత్రం వేరే లెవెల్ లో ఉండబోతుందని ట్రైలర్ తో క్లారిటీ వచ్చేసింది. బుజ్జితో విన్యాసం చేస్తూ ట్రైలర్ లాస్ట్ షాట్ లో ప్రభాస్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ సైతం అదుర్స్ అనేలా ఉన్నాయి.
 
కల్కి 2898 ఏడీ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రం భారీ స్థాయిలో ఉండబోతున్నాయని ఇందులో ఎలాంటి సందేహాలు మాత్రం అక్కర్లేదని నెటిజన్లు చెబుతుండటం సోషల్ మీడియా వేదికగా తెగ చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ లుక్స్ పరంగా కూడా సరికొత్తగా కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. దీపిక ఈ సినిమాలో ఒకింత క్లిష్టమైన పాత్రలో కనిపిస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
కల్కి 2898 ఏడీ సినిమా నాగ్ అశ్విన్ కీర్తి ప్రతిష్టలను పెంచడంతో పాటు వైజయంతీ బ్యానర్ కీర్తి ప్రతిష్టలను పెంచే అవకాశాలు ఉన్నాయి. బడ్జెట్ పరంగా నాగ్ అశ్విన్ పూర్తిస్థాయిలో న్యాయం చేశారని నెటిజన్లు చెబుతున్నారు. నాగ్ అశ్విన్ రాజమౌళిని మించిన డైరెక్టర్ అనిపించుకోవడం ఖాయమని నెటిజన్లు సూచనలు చేస్తున్నారు. నాగ్ అశ్విన్ రేంజ్ రాబోయే రోజుల్లో మరింత పెరగడం పక్కా అని చెప్పవచ్చు. కల్కి 2898 ఏడీ సినిమా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ సినిమా అవుతుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


 


మరింత సమాచారం తెలుసుకోండి: