తెలంగాణ రాష్ట్రం లో బిజెపి రోజురోజుకు పుంజుకుంటుంది. 2018 ఎన్నికల్లో వేళ్ళ మీద లెక్కపెట్టే సీట్లు   గెలుచుకున్న బిజెపి 2023 ఎలక్షన్స్ వచ్చే సరికి మొత్తం ఎనిమిది పార్లమెంటు స్థానాలు గెలుచుకొని తిరుగులేని శక్తి గా మారింది. రాబోవు ఐదు ఏళ్ల లో తెలంగాణ రాష్ట్రం లో బిజెపి తిరుగులేని శక్తి గా ఎదగాలనే ప్లాన్ చేస్తోంది. ఇదే తరుణం లో కిషన్ రెడ్డి మరియు బండి సంజయ్ కి కేంద్రమంత్రి పదవులు కట్టబెట్టింది. ఇక అసలైనటు వంటి బిజెపి రాష్ట్ర రథసారధి పదవి మిగిలి ఉంది. దీన్ని ఎవరికిస్తే రాష్ట్రం లో పార్టీ బలపడుతుంది అనే ఆలోచనలు బిజెపి ఢిల్లీ పెద్దలు చేస్తున్నారట. 

ఈ క్రమం లోనే ఓ వైపు ఈటల రాజేందర్,  మరోవైపు డీకే అరుణ, ఇంకోవైపు  రఘునందన్ రావు, రాజాసింగ్  పదవి కోసం పోరాడుతున్నారట. ఈ క్రమం లోని ఢిల్లీ అధిష్టానం  ఈటెల రాజేందర్ కు  ప్రెసిడెంట్ పోస్ట్ ఇస్తానని  హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమం లోనే ఈటల రాజేందర్ రాష్ట్రం లో బిజెపి కి  కొత్తనీరు, కొత్త శక్తి అందించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యలు చేశారు. ఇదే తరుణం లో    మొదటి నుంచి పార్టీలో ఉన్నటు వంటి రాజా సింగ్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

ధర్మం కోసం, దేశం కోసం పోరాడుతూ పార్టీ ని మోస్తూ  దేశ భక్తి కలిగి ఉన్న నాయకులకు మాత్రమే పార్టీ పగ్గాలు అప్పగించాలని  కామెంట్ చేశారు.  దీంతో పార్టీ నాయకుల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ బేధాలు  మరొక సారి బయటపడ్డాయి. కొత్తగా పార్టీ లో చేరిన వారికి పగ్గాలు ఇవ్వొద్దని  రాజాసింగ్ అంటున్నారన్న మాట. అయితే ఈయన ఈటెలను ఉద్దేశించే   వ్యాఖ్యలు  చేశారని బయట వినిపిస్తున్న టాక్. మరి చూడాలి ఈ వ్యవహారం ఎక్కడ వరకు దారి తీస్తుంది అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: