టాలీవుడ్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దశకత్వంలో రాబోతున్న చిత్రం కల్కి 2898AD. ఈ సినిమా ఈ నెల 27వ తేదీన భారీ లెవెల్ లో విడుదల కాబోతోంది. సుమారుగా అన్ని భాషలలో కూడా ఈ సినిమా విడుదల అయ్యేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. ఒకవైపు సినిమా ప్రమోషన్స్ ను కూడా వేగవంతం చేస్తున్న చిత్ర బృందం తాజాగా కల్కి సినిమాకి మాత్రం ఏపీ గవర్నమెంట్ ఒక శుభవార్తను అందించినది. అయితే ఇది సామాన్యులకు షాక్ అయ్యేలా కనిపిస్తోంది.


అసలు విషయంలోకి వెళ్తే కల్కి సినిమా రేట్స్ భారీగా పెంచేసినట్లు తెలుస్తోంది. ఒక్కో సినిమా టికెట్ ధర రూ .400 రూపాయలకు అమ్ముకునేలా పర్మిషన్లు సైతం ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇంకా కొత్త టికెట్ల ధరలను సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు.. అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మరో నాలుగు రోజులలో ఈ సినిమా విడుదల కాబోతున్న సమయంలో కచ్చితంగా టికెట్లు రేట్లు పెంపు పైన క్లారిటీ రాబోతున్నది. మొదటిరోజు అర్ధరాత్రి షోలకు కూడ వేసుకోవచ్చు అని ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్ సైతం అశ్వని దత్ క్లారిటీ ఇచ్చారు.


అందుకు అవసరమైనటువంటి అనుమతులను కూడా పొందినట్లుగా తెలుస్తోంది. టికెట్లను ప్రీమియం ధరకు విస్తరిస్తూ ఉండగా మరికొన్ని ప్రాంతాలలో మూడు వేలకు పైగా అమ్ముడుపోతున్నట్లు సమాచారం. సామాన్యులు సైతం ఇలాంటి సినిమాలను చూడాలంటే కచ్చితంగా ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. ఒకవేళ అన్ని అనుకున్నట్టుగా జరిగితే జూన్ 26 అర్ధరాత్రి నుంచే కల్కి సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. దాదాపుగా రూ.600 కోట్ల రూపాయలతో తెరకెక్కించిన ఈ చిత్రం భారీగానే ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భారీ ఓపెనింగ్ టికెట్లు ధరల పెంపు బెనిఫిట్ షో లతో కచ్చితంగా కల్కి సినిమాకి భారీ మొత్తంలోనే వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: