
అయితే ఇలాంటి నేపథ్యంలో... జమ్మూ కాశ్మీర్ ఎయిర్ పోర్ట్ సమీపంలో పాకిస్తాన్ ఆత్మహుతి డ్రోన్ దాడులకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ డ్రోన్ రాగానే అలర్ట్ అయిన ఇండియన్ ఆర్మీ... వెంటనే తిప్పి కొట్టింది. జమ్మూ జిల్లాలో మొత్తం సైరన్లు మోగిస్తున్నారు ఇండియన్ ఆర్మీ సభ్యులు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం కూడా ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలోనే జమ్మూ ప్రాంతంలో ఉన్న.. అక్నూర్, సాంబ, కిస్వార్ లాంటి ప్రాంతాలలో కరెంటు కూడా నిలిపివేశారు అధికారులు. జమ్ము కాశ్మీర్ లోని పటాన్కోడ్ అలాగే ఉదయపూర్ ప్రాంతాల్లో ఈ దాడులు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే పాకిస్తాన్ చేసే దాడులను ఇండియన్ ఆర్మీ.. చాలా సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఆకాశంలోనే పాకిస్తాన్ డ్రోన్లను నిర్వీర్యం చేస్తోంది ఇండియన్ ఆర్మీ. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ సమీపంలో రెండు డ్రోన్లను ధ్వంసం చేసింది. ముఖ్యంగా పాక్ కు చెందిన మొత్తం మూడు ఒక F16, రెండు F17 fighter jet ను కూల్చివేసింది భారత్ ఆర్మీ.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టి కి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తం గా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు