భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. భారత్ పాక్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లాయి. సెన్సెక్స్ ఏకంగా 357 పాయింట్లు కుంగాయి. ఈరోజు ఉదయం జమ్మూలో సైతం సైరన్లు మోగాయి. స్థానికులు ఇళ్లలో మాత్రమే ఉండాలని బాల్కనీలోకి సైతం రావద్దని దాడులు జరగవచ్చని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హెచ్చరించడం గమనార్హం.
 
ఇండియా గేట్ ప్రాంతం దగ్గర ట్రాపిక్ నియంత్రణ జరుగుతుండగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని స్థానికులకు సూచనలు వెళ్లాయి. మరోవైపు ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాక్ సైనిక అధికారులు సైతం పాల్గొనడం ఒకింత సంచలనం అవుతోంది. ఉగ్రవాదులతో పాక్ సంబంధాలను భారత్ అంతర్జాతీయంగా ఎండగట్టడం గమనార్హం. మరోవైపు బీ.ఎస్.ఎఫ్ ఏడుగురు జేషే మహ్మద్ చొరబాటుదారులను మట్టుబెట్టారు.
 
సాంబా సెక్టార్ లో చొరబాటు యత్నాన్ని భద్రతా బలగాలు అడ్డుకోవడం గమనార్హం. మరోవైపు ఆపరేషన్ సింధూర్ గురించి పాక్ నటుడు పవాద్ ఖాన్ కామెంట్లు చేయగా బాలీవుడ్ నటి రూపాలి గంగూలీ ఈ కామెంట్లను ఖండించారు. మీలాంటి వ్యక్తులు భారతీయ సినిమాలలో వర్క్ చేయడం మాకు సిగ్గు చేటని ఆమె పోస్ట్ చేశారు. మరోవైపు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏటీంలు మూసివేస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.
 
అయితే ఏటీఎంల మూసివేతకు సంబంధించి వైరల్ అవుతున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. కొంతమంది వాట్సాప్ వేదికగా ఈ తరహా ప్రచారాలు చేస్తున్నారు. పీబీఐ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ నేపథ్యంలో ఈ తరహా వార్తలు పూర్తిస్థాయిలో ఆగుతాయేమో చూడల్సి ఉంది. పాక్ భారత్ మధ్య పరిస్థితుల నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: