ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం రోజున ఇండియాను అనవసరంగా గెలిచిన పాకిస్తాన్ ఇప్పుడు... నరకం అనుభవిస్తోంది. 26 ప్రాంతాల్లో... డ్రోన్స్ వేసేందుకు పాకిస్తాన్ కుట్రలు పన్నింది. అయితే ఆ కుట్రలను ఇండియన్ ఆర్మీ వెంటనే తిప్పి కొట్టేసింది. అంతేకాదు పాకిస్తాన్ దేశాన్ని చావు దెబ్బ కొట్టింది ఇండియా. పాకిస్తాన్లో ఉన్న నాలుగు ఎయిర్ బేస్  లను టార్గెట్ చేసింది ఇండియన్ ఆర్మీ.

 డ్రోన్ల ద్వారా పాకిస్తాన్  ఎయిర్ బేస్ ల మీద విరుచుకు పడింది.  మొదట రావల్పిండి, ఆ తర్వాత లాహోర్  అనంతరం ఇస్లామాబాద్ లో భారీ పేలుళ్లు జరిపింది. ముఖ్యంగా నూర్ఖాన్ ఎయిర్ బేస్ సమీపంలో భారీ  జరిపింది ఇండియన్ ఆర్మీ. నూర్ ఖాన్, మురీదు , రఫీ ఎయిర్ బేస్ లపై కూడా భారత దాడి చేసింది. దీంతో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అయింది. ఇలా మొత్తంగా నాలుగు ఎయిర్ బేసులపై  ఇండియన్ ఆర్మీ దాడి చేసింది.

 ఈ దెబ్బకు పాకిస్తాన్... కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పాకిస్తాన్ లో ఉన్న విమానాశ్రయాలను మూసివేసింది. అలాగే... తమ దేశంలో  ఉన్న అన్ని విమానాలను కూడా ఇవాళ రద్దు చేసుకుంది. ఇవాళ ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే పరిస్థితి ఉంటుందని తెలుస్తోంది. ఇక్కడ ఎన్ని దాడులు జరిగాయి..? ప్రాణ   నష్టం ఎంత జరిగింది అనే వివరాలను... తెలుసుకోనుంది పాకిస్తాన్. అయితే పాకిస్తాన్ ఆర్మీ మాత్రం మూడు ఎయిర్ బేస్ లపై  ఇండియా దాడి చేసినట్లు అధికారికంగా ప్రకటించింది.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దుది

మరింత సమాచారం తెలుసుకోండి: