ఇప్పటి వరకు అ నే క సార్లు పాకిస్తాన్ కి సంబంధించిన ఉగ్రవాదులు ఇండియా పై దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి . కానీ అలా ఇండియాపై పాకిస్థాన్ ఉగ్రవాదులు అనేక సార్లు దాడి చేసిన కూడా భారత్ ప్రభుత్వం మాత్రం వారిపై యుద్ధాలను చేయాలి అని చాలా వరకు అనుకోలేదు. కానీ కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ కు సంబంధించిన ఉగ్రవాదులు మన భారతీయులను అనవసరంగా చంపివేశారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం అత్యంత సీరియస్ గా తీసుకుంది. ఇలా అమాయకులైన ప్రాణాలను తీసివేసిన ఉగ్ర వాదులను ఏమి చేయకుండా వదిలేస్తే వారు మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది.

అలాంటి ఉగ్రవాదులను ఏమి చేయకుండా వదిలేస్తే వారు అనేక మంది భారతీయుల ప్రాణాలను అవకాశం ఉంది అనే నేపథ్యంలో భారత ప్రభుత్వం అమాయకులైన భారతీయుల ప్రాణాలను తీసిన ఉగ్రవాదులను చంపేయాలి అని డిసైడ్ అయింది. అందులో భాగంగా రెండు రోజుల క్రితం ఒక్క సారిగా భారత ఆర్మీ , ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయడం మొదలు పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే భారత ఆర్మీ అనేక మంది ఉగ్రవాదులను చంపివేసింది. ఇక పాకిస్తాన్ కూడా తిరిగి భారత్ పై అటాక్ చేయడం మొదలు పెట్టింది. కానీ మన భారత్ ఆర్మీ వారి అటాక్స్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.

ఇకపోతే తాజాగా ఇండియా పై పాకిస్తాన్ మిస్సైల్ అటాచ్ చేసింది. ఫతేహ్ - 1 మిస్సైలతో జమ్మూ ,  పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లతో పాటు శ్రీనగర్ , బియాస్ , ఉదంపూర్ పట్టణాలపై దాడి చేసింది. వీటిని భారత్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పి కొట్టినట్లు తెలుస్తోంది. పలుచోట్ల భారీ శబ్దాలు కూడా వినిపించాయి. మరో వైపు భారత్ తమపై బాలిస్టిక్ క్షుపనలు ప్రయోగించింది అని ప్రస్తుతం పాకిస్తాన్ ఆరోపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: