గత రెండు మూడు రోజుల నుంచి భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం కొనసాగుతూ ఉన్నది. అయితే నిన్నటి రోజున సాయంత్రం కాల్పుల విరమణ ఒప్పందంతో పులిస్టాప్ పడినట్లుగా కనిపిస్తోంది.. అయితే కాల్పులు విరమణ పైన పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ స్పందిస్తూ అక్కడి ప్రజలను, సైన్యాన్ని  సైతం మభ్య పెట్టేలా కనిపిస్తున్నారు. అందుకు సంబంధించి ఆయన నిన్నటి రోజున రాత్రి పెట్టినటువంటి ప్రెస్ మీట్ చూస్తే ఈ మాటలు నిజమానేలా కనిపిస్తూ ఉన్నాయి.


భారత్ ప్రధాని షరీఫ్ నిన్నటి రోజున మాట్లాడుతూ భారత్ తో యుద్ధంలో తాము విజయం సాధించామంటూ ప్రకటించుకున్నారు.. మా దేశాన్ని, మా పౌరులను రక్షించుకోవడానికి తాము ఎక్కడికైనా వెళ్తామని తెలియజేశారు.. పాకిస్తాన్ ని ఎవరైనా సరే సవాల్ చేస్తే వారిని విడిచి పెట్టే ప్రసక్తే లేదంటూ మాట్లాడారు.. భారత్ తమ దేశంలో ఉండే మసీదులు, సామాన్య పౌరుల పైన డ్రోన్లతో మిస్సైలతో దాడి చేశారని అనేకమంది సాధారణ పౌరుల చావుకు కూడా కారణమయ్యారంటు పాక్ ప్రధాని మండిపడ్డారు. అలాగే తమ దేశం పైన ఎన్నో ఆరోపణలు కూడా చేస్తున్నారని భారత్ కు తగిన బుద్ధి చెప్పామంటూ తమ జోలికి వస్తే ఏం జరుగుతుందో చూపిచ్చామంటూ యుద్ధంలో విజయం సాధించామని ప్రకటించుకున్నారు.


అయితే ఈ వార్తలన్నీ కూడా అక్కడ పాకిస్తాన్ ప్రజలను మభ్య పెట్టేందుకు మాట్లాడినట్లుగా కనిపిస్తోంది.. ఎందుకంటే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ స్థావరాలను కూడా ఎన్నో నాశనం చేసింది ఇండియా.. అలాగే పాకిస్తాన్ సైన్యం కూడా చాలామంది మరణించారు వీటికి తోడు ఉద్యోగాలను కూడా రాజీనామా చేసి కొంతమంది వెళ్లిపోయారు.. కేవలం దొంగ దెబ్బలు తీయడానికే ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ ఆర్మీ మళ్లీ విజయం సాధించామంటూ ప్రకటించుకోవడంతో చాలామంది హేళన చేస్తున్నారు.. అంతేకాకుండా భారత్ చేసిన విధ్వంసం పాకిస్తాన్ టీవీలలోని ప్రసారమవుతూ ఉండడమే కాకుండా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


అయితే కాల్పులు విరమణ ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ మూడు గంటలకే మళ్ళీ డ్రోన్లతో కాల్పులను మొదలుపెట్టింది పాకిస్తాన్ తన వక్రబుద్ధిని బయటపెట్టి మరి విజయం సాధించామంటూ చెప్పుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: