
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరు నెలలలోనే ఒక ఏడాదిలోని మూడుసార్లు పెంచడం రికార్డ్. ఈ ఏడాది ఫిబ్రవరిలో బీరు ధరలు 15% వరకు పెంచగా ఈనెల 18 వాటిని అమలులోకి తీసుకోవచ్చారు. అలాగే క్వార్టర్ పై 10 రూపాయలు ఫుల్ బాటిల్ పైన 40 రూపాయలు సైతం ఇప్పటికే పెంచారు. ఈ బాధుడికి లబోది పొమ్మంటున్న మందుబాబులు ఇప్పుడు ఏకంగా మరొకసారి పెంచబోతున్నారని తెలిసి మందు తాగాలంటే భయమేస్తోందంటూ తెలుపుతున్నారు. అయితే బీర్లు తయారు చేసే కంపెనీలకు బేసిక్ ధరలు పెట్టినట్టుగానే తమకు కూడా ధరలు పెంచాలంటూ పలు రకాల కంపెనీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయట.
ప్రస్తుతం TGBCL చెల్లిస్తున్నటువంటి ధరల కంటే 30% అదనంగా పెంచాలని డిమాండ్ చేస్తున్నారట. ఈ విషయం పైన ఐదుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ కమిటీలు ఇప్పుడిస్తున్న బేసిక్ ధరలకంటే కనీసం 15% వరకు అదనంగా చెల్లించుకోవచ్చంటూ తెలియజేశారు. ఈనెల 18 నుంచి అన్ని కేటగిరీల మద్యం మీద..7.7 శాతం నుండి 9.9 శాతం వరకు విధించారు. ఈసెస్ వల్ల ఏడాదికి 2500 కోట్ల రూపాయల వరకు తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం వస్తుందట. ప్రస్తుతం మళ్లీ పెంచబోతున్న ధరలు ఎప్పుడు అమలు అవుతాయని విషయం ఇంకా తెలియాలి. జూన్ 30వ తేదీన కంపెనీలతో ఒప్పందం ముగుస్తుందని.. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మద్యం కంపెనీల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించింది.. జూలై 1వ తేదీ నుంచి కొత్త ఒప్పంద మొదలు కాబోతోంది.