భారతదేశంలో యంగ్ టెన్నిస్ ప్లేయర్ గా పేరుపొందిన రాధిక యాదవ్ కూడా ఒకరు. ఈమె వయసు ప్రస్తుతం 25 సంవత్సరాలు పలు అంతర్జాతీయ విదేశీయ టోర్నమెంట్లలో పాల్గొనింది. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న తర్వాత క్రీడాకారిగా ఎదుగుతోంది. ఇటువంటి ప్లేయర్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ పలు రకాల రీల్స్ కూడా చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు అభిమానులకు టచ్చులో ఉంటుంది రాధిక యాదవ్. అలాంటి రాధిక జీవితం దారుణమైన ఘటనను ఎదుర్కొంది అదే తన జీవితాన్ని ముగిస్తుందని కూడా ఈ టెన్నిస్ ప్లేయర్ ఊహించలేదు.


అసలు విషయంలోకి వెళ్తే రాధిక యాదవ్ సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించడం తన తండ్రికి మొదటి నుంచి ఇష్టం లేదట. ఈ విషయాన్ని పదేపదే ఎన్నో సార్లు తెలియజేశారు రాధికా తండ్రి. సెలబ్రిటీలుగా ఉండాలని చిల్లర రీల్స్ చేయకూడదని ఆమెను ఎన్నోసార్లు హెచ్చరించారట. రాధిక తండ్రి మాటలను ఆమె పట్టించుకోలేదు.పైగా తనకు నచ్చినట్టుగానే సోషల్ మీడియాలో ఉండడం మొదలుపెట్టడంతో పాటుగా రిల్స్ వంటివి చేయడం చేస్తూ ఉండేది.దీంతో ఆమె తండ్రికి ఇబ్బందిగా మారడంతో ఆమెను అత్యంత దారుణంగా చంపేశాడు.


హర్యానా రాష్ట్రంలో గురు గ్రామ ప్రాంతంలో ఈ టెన్నిస్ ప్లేయర్ ను తీవ్రంగా గాయాల పాలు చేశారట. ఆమెను ఆసుపత్రికి  తీసుకువెళ్లి చికిత్స అందించే లోపు మరణించినట్లు సమాచారం. రాధిక తండ్రి చేసిన ఈ ఉదాంతం తెలియడంతో ఆమె తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. రాధిక తండ్రి తన కూతురిని టెన్నిస్ వైపుగా ప్రోత్సహించినప్పటికీ తన కూతురికి ఎక్కువగా స్వేచ్ఛనిచ్చేవాడు కాదట. టెన్నిస్ ప్లేయర్  వెస్ట్రన్ దుస్తులు ధరిస్తూ ఉంటారు. అయితే ఈ దుస్తులు ధరించడం రాధిక తండ్రి తప్పు పట్టే వారిని.. ఇలా కొన్ని సందర్భాలలో ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో మాట్లాడడం కూడా మానేసిందట. ఈ విషయం తెలిసి రాధికా తండ్రిని  పలువురు నెటిజన్స్ కూడా తిట్టిపోస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: