
అయితే ల్యాండ్ టైటిలింగ్ చట్టం వల్ల జగన్ పై ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ విమర్శల వల్లే గతేడాది వైసీపీకి ఘోర ఫలితాలు ఎదురయ్యాయి. జగన్ పాలనలో పంటలకు మద్దతు ధరలు పలకగా ప్రస్తుతం భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రైతులకు జరుగుతున్న అన్యాయంపై పోరాడతానని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
రైతులకు అందాల్సిన బీమా, ఇన్ ఫుట్ సబ్సిడీ విషయంలో అన్యాయం జరగడంతో అన్నదాతకు అండగా పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు జగన్ వెల్లడించారు. రైతులకు మేలు చేస్తున్న జగన్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు కామెంట్లపై ఏ విధంగా స్పందించనున్నారో చూడాల్సి ఉంది.
అన్నదాత సుఖీభవ నిధులు ఈ నెల 18వ తేదీన రైతుల ఖాతాలలో జమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఈ పథకం అమలైతే రైతులకు పెట్టుబడి సాయం రూపంలో ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు. రేపు రైతుల ఖాతాలలో నిధులు జమవుతాయో లేదో చూడాలి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు