ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి గన్నవరం ఎయిర్ పోర్ట్ ని.. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ గా మార్చాలని నిర్ణయించుకున్నారు. 2014- 19  మధ్యలో అశ్వని దత్ లాంటి వాళ్లతో అక్కడ ఉన్నటువంటి వాళ్లకి స్థలాలను తీసుకొని మరి వాటికి బదులుగా అమరావతిలో లాండ్స్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి చంద్రబాబు. అయితే ఆ ఫ్లాట్లు ఈ మధ్యన ఇచ్చినట్లుగా సమాచారం అదంతా జరిగింది అప్పుడు. అయితే ఇప్పుడు ఆ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ విస్తరణ అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టారు.. ఇప్పటికే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ దిగేటువంటి టెర్మినల్ ఉన్నది.


అయితే అది ఇంకా విస్తరించే పని పక్కన పెట్టేసినట్లు అలాగే పూర్తిగా  ఆపేసినట్టే కనిపిస్తోంది. అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కట్టాలని ఏపీ ప్రభుత్వం బావిస్తోంది . కాబట్టి ఇకమీదట గన్నవరం ఎయిర్ పోర్ట్  పై దృష్టి సాధించరు. అది అక్కడితో ఆగిపోయినట్టే. మరి భూ సేకరణ చేసినటువంటి అంశం పైన ఏం చేస్తారు తెలియదు. మరొక పక్కన భోగాపురం ఎయిర్ పోర్ట్ నడుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించి పనులు కూడా జరుగుతున్నాయి. ఎయిర్ పోర్ట్ వచ్చే ఏడాది కానీ మరో ఏడాదిలో కానీ ప్రారంభించే అవకాశం ఎక్కువగా ఉన్నాయట.


ఎందుకంటే ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో PPP మోడ్లో నడుస్తోంది. కర్నూలు కడప ఇవన్నీ కూడా ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా తాడేపల్లిగూడెంలో కూడా మొదలు పెట్టబోతున్నారు. అలాగే కుప్పంలో కూడా పెడతామని చెబుతున్నారు చంద్రబాబు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కడప విమానాశ్రయం 29 KW  గ్రీడ్ కనెక్టెడ్ సోలార్ రూఫ్ టాప్ ప్లాంట్ ఏర్పాటు కి రూ.20,62,420 కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అలాగే రాజమండ్రి విమానాశ్రయం డివిఓఆర్ సబ్ హెడ్ ఎలక్ట్రిక్ వర్క్ కి రూ .12,19,33 లక్షల రూపాయలు కేటాయించారు. విశాఖ ఎయిర్ పోర్ట్ కి వివిధ రకాల ఎల్ఈడి పిక్చర్స్ వాటికి రూ .13,34,551 లక్షలు.. అలాగే స్టాప్ క్యాంటీన్ ఏర్పాటుకి అన్ని పనులకు కూడా టెండర్లను పిలిచారు. ఇందులో కొన్నిటికి రాష్ట్ర ప్రభుత్వం మరికొన్నిటికి కేంద్ర ప్రభుత్వం నిధులతో నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: