కొంతమంది రాజకీయ నాయకుల అనుచరులు వారి అండదండలు చూసుకొని రెచ్చిపోతూ ఉంటారు.అయితే ఈ కింది స్థాయి వాళ్ళు చేసే ఆగడాలు ఆ రాజకీయ నాయకులకు అంతగా తెలియవు. ప్రస్తుతం ఏపీలో బాలకృష్ణ అనుచరుడి గా చెప్పుకునే వ్యక్తి ఓ మహిళను వేధిస్తూ అడ్డంగా పట్టుబడ్డారు.ఆ మహిళ మీడియా ముందుకు వచ్చి బాలకృష్ణ అనుచరుడిని అని నన్ను ముప్పు తిప్పలు పెడుతున్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు మీడియా ముందు బయటపెట్టింది. మరి ఇంతకీ బాలకృష్ణ అనుచరుడిని అని చెప్పుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్న ఆ వ్యక్తి ఎవరు.. అసలు వివరాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. క్యాస్టింగ్ కౌచ్ అనేది సినిమా ఇండస్ట్రీలోనే కాదు ప్రతి ఒక్క వ్యవస్థలో కూరుకుపోయింది. అది ఎక్కడైనా సరే దుర్బుద్ధిగల మృగాళ్ళ లాంటి మగవాళ్ళు ఉన్నంతకాలం ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉంటూనే ఉంటుంది.

అలా తాజాగా ఏపీ లోని హిందూపురంలో ఉండే ఓ వ్యక్తికి సంబంధించి సంచలన విషయం బయటపడింది.ఇక అసలు విషయం ఏమిటంటే..ఓ ముస్లిం మహిళా ఉద్యోగి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అనుచరుడిని అని చెప్పుకుంటూ తనని వేధిస్తున్నాడు అంటూ మీడియా ముందుకు వచ్చి చెప్పింది. ప్రభుత్వ హాస్పిటల్ లో ఔట్ సోర్సింగ్ నర్సుగా పనిచేసే ఈ ముస్లిం మహిళా ఉద్యోగి తాజాగా మీడియా ముందుకు వచ్చి తన గోడు చెప్పుకుంది.. హిందూపురం బాలకృష్ణ అనుచరుడిని అని చెప్పుకునే చింటూ అనే వ్యక్తి నన్ను టార్చర్ చేస్తున్నాడని, పని కావాలంటే ఖచ్చితంగా పక్కలోకి రావాలి అంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని మీడియా ముందు తెలియజేసింది.అంతేకాదు ఈ విషయం గురించి సీఐ కి ఫిర్యాదు చేస్తే ఆయన కనీసం కేసు కూడా తీసుకోవడం లేదని, చింటూ అనే వ్యక్తి సీఐ కి చెప్పడం వల్లే పోలీసులు కూడా నా కేసుని సీరియస్ గా తీసుకోవడం లేదని ఆ ముస్లిం మహిళా ఉద్యోగి మీడియా ముందుకు వచ్చి చెప్పింది.

చాలా రోజుల నుండి ఆ వ్యక్తి నన్ను లైంగికంగా వేధిస్తున్నాడని, ఆయన వల్ల నాకు ప్రాణహాని కూడా ఉంది అంటూ చెప్పుకొచ్చింది. అయితే బాలకృష్ణ అనుచరుడు కావడంతో చాలామంది ఆయనకు భయపడి ఎవరు కూడా ముందుకు రావడంలేదని, కానీ నాకు న్యాయం చేయాలి అని, ఆయన వల్ల ప్రాణహాని ఉంది అంటూ చెప్పడంతో ఈ విషయం కాస్త మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ విషయం బాలకృష్ణ దాకా వెళ్తుందా.. బాలకృష్ణ ఈ విషయంలో రియాక్ట్ అవుతారా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఆడవాళ్లను దేవతలుగా కొలిచే నందమూరి ఫ్యామిలీ హీరో పేరు చెప్పుకొని ఈ వ్యక్తి చేసే పని పట్ల చాలామంది ఫైర్ అవుతున్నారు. వెంటనే బాలకృష్ణ కల్పించుకొని ఆ వ్యక్తి కి శిక్ష పడేలా కఠిన చర్యలు తీసుకోవాలని మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: