ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఇదే టాక్ వినిపిస్తోంది.. తెలంగాణ హోమ్ మంత్రి పీఠంలో కూర్చునేది చిరంజీవా లేక నాగార్జుననా అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ అధిష్టానం మొత్తం ఇద్దరి పేర్లలో ఎవరో ఒకరిని అనౌన్స్ చేయాలన్నట్టు చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి ఇంతకీ తెలంగాణ హోం మంత్రి కహాని ఏంటయ్యా అంటే..ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాబోతున్న సంగతి  తెలిసిందే..అయితే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో కాంగ్రెస్ పార్టీ తరఫునుండి బలమైన అభ్యర్థిని దించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుందట.ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి సన్నిహితంగా మెదులుతున్న సీనియర్ హీరోలు అయినటువంటి నాగార్జున, చిరంజీవి ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి పార్టీ టికెట్ ఇచ్చి అక్కడ గెలిచాక వారికి హోం మంత్రి పదవిని ఇవ్వాలని చూస్తున్నారట. 

అయితే రీసెంట్ గా కాంగ్రెస్ నుండి చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి ఇస్తున్నారు అనే రూమర్స్ పై ఆయన క్లారిటీ ఇస్తూ నేను ఇక రాజకీయాల్లోకి రాను.ఈ జన్మకు సినిమాల్లోనే కొనసాగుతాను. ఈ పిచ్చి ప్రచారాలు ఆపండి అని చెప్పారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం మరోసారి చిరంజీవిని కలిసి హోం మంత్రి పదవి ఆశ చూపడంతో ఆయన కాస్త ఆలోచనలో పడ్డట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి.మరోవైపు నాగార్జునని కూడా రాజకీయాల్లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టు తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుండి ఎమ్మెల్యేలుగా ఎవరు గెలవలేదు.ఆ మధ్యకాలంలో జరిగిన ఉప ఎన్నికల్లో శ్రీ గణేష్ గెలిచినప్పటికీ ఆయన ఎస్సీ వర్గానికి చెందినవాడు కాబట్టి ఇప్పటికే తెలంగాణ కేబినెట్లో ముగ్గురు ఎస్సీ మంత్రులు ఉండడంతో ఈయనకు అవకాశం రాలేదు.

దాంతో ప్రస్తుతం అందరి కన్ను జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీదే ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నిల్చున్న అభ్యర్థి గెలిస్తే ఖచ్చితంగా ఆయనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే. ఎందుకంటే  గ్రేటర్ హైదరాబాద్ నుండి ఎవరికి మంత్రి పదవి రాలేదు కాబట్టి జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ నుండి గెలిస్తే ఖచ్చితంగా హోంమంత్రి పదవి వస్తుందనే టాక్ ఉంది. ఇప్పటికే ఈ ఉపఎన్నికలో పోటీ చేయడానికి చాలామంది ఆసక్తికనబరుస్తున్నారట. కానీ బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని సినిమాలో ఫేమస్ అయిన నాగార్జున లేదా చిరంజీవిని అభ్యర్థిగా ఖరారు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసిందట.కానీ చిరంజీవి రీసెంట్ గానే క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఆయన రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన అయితే కనబడడం లేదు.ఇక నాగార్జున మీదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆశ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. కానీ నాగార్జునకి కూడా రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పందించినట్టు సమాచారం. ఏది ఏమైనప్పటికీ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ కి ప్రతిష్టాత్మకం కాబోతోంది

మరింత సమాచారం తెలుసుకోండి: