మనందరికీ తెలిసిందే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల “స్త్రీ శక్తి” పథకం కింద ఉచిత బస్సు ప్రయాణాలను ప్రారంభించింది. ఆగస్టు 15న అధికారికంగా ప్రారంభమైన ఈ పథకానికి మహిళలు విపరీతంగా స్పందిస్తున్నారు .. రోజుకు సగటున 15 లక్షల నుండి 18 లక్షల వరకు మహిళలు ప్రయాణిస్తున్నారని, త్వరలోనే ఈ సంఖ్య 26 లక్షలకుపైగా పెరిగే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పథకం అమలు సంగతి పక్కన పెడితే, సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ హాట్ టాపిక్‌గా మారింది. ఒక మహిళ ఉచిత బస్సు ప్రయాణంపై రీల్ చేస్తూ తన మొబైల్ వాల్‌పేపర్‌గా ఆధార్ కార్డుని పెట్టుకుంది ..


దీని వెనుక కారణం తెలుసుకున్నవారికి షాక్ అయ్యే పరిస్థితి. ప్రతిసారి బస్సు ఎక్కినప్పుడు బ్యాగ్‌లో నుంచి ఆధార్ కార్డు తీసి చూపడం కష్టంగా ఉంటుంది. జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు మరింత ఇబ్బందిగా మారుతుంది. అందుకే తెలివిగా ఆలోచించి, మహిళలు ఆధార్ కార్డుని మొబైల్ వాల్‌పేపర్‌గా సెట్ చేసుకున్నారు. అలా కండక్టర్‌కి సులభంగా చూపించొచ్చు, సమయం వృధా కావడం లేదు, ప్రయాణం కూడా ఈజీగా సాగుతుంది  ... ఈ వీడియో చూసిన నెటిజన్లు “ఇదేం వాడకం  తల్లో!” అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. “ఐడియా బాగుంది” అని కొందరు పొగుడుతుండగా, అధికారులు కూడా “మహిళలు అనుకుంటే ఏదైనా సాధ్యమే” అంటూ ఆశ్చర్యపోతున్నారు.



మొత్తానికి చంద్రబాబు తెలివిగా స్త్రీ శక్తి పథకాన్ని తీసుకువస్తే, మహిళలు కూడా అంతకంటే ఎక్కువ తెలివితో దాన్ని వాడుకునే మార్గాలు కనుక్కుంటున్నారు. అందుకే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ ఫ్రీ బస్ పధకానీ మహిళలు చాలా తెలివిగా ఉపయోగించుకుంటున్నారు. దీనికి సంబంధించిన రీల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. చాలా చాలా ఫన్నీగా ఉంటున్నాయ్ ...!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: