దేశం అభివృద్ధి లో ముందుకు వెళ్లాలంటే తప్పని సరిగా ప్రభుత్వం నియమ నిబంధనలు పాటించాలి. ముఖ్యంగా మనం అగ్గిపెట్టె కొన్న దగ్గరి నుంచి మొదలు హెలికాప్టర్ కొనే వరకు తప్పని సరిగా జిఎస్టి అనేది ఉంటుంది. అలా జిఎస్టి ఉంటేనే దేశం లో ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. అయితే ఈ జీఎస్టీ అనేది ఎక్కువ శాతం ఉంటే పేదల పై భారం పడుతుంది. అలాంటిది ఇండియా లో జీఎస్టీ పెరుగుదల అనేది ఒక రికార్డు స్థాయి కి చేరుకుంది.. ముఖ్యంగా జిఎస్టి లో ఇండియా  ఆర్థిక అభివృద్ధి సాధించింది. మరి ఈ ఏడాది ఎంత వృద్ధి సాధించింది ఆ వివరాలు ఏంటో చూద్దాం.. 

దేశ జీఎస్టీ పోయిన ఏడాది ఇదే నెల తో పోల్చుకుంటే ఈ ఏడాది చాలా పెరిగిందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది భారతదేశ జిఎస్టి 10 శాతం పెరిగిందని అంటున్నారు. ముఖ్యంగా అమెరికా తో పాటు ఇతర దేశాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ  జీఎస్టీ పెరుగుదల అనేది భారత్ లో  పెరిగింది.1,24,986 కోట్లు  పోయిన ఏడాది ఆగస్టు లో సంపాదిస్తే, 1,36, 962 కోట్ల ఎదుగుదల ఈ ఏడాది వృద్ధి చెందింది. అయితే ఇందులో కొన్ని రాష్ట్రాల్లో మైనస్ కూడా ఉంది. 

ముఖ్యంగా చండీగర్ లో మైనస్ 12%, మణిపూర్లో మైనస్ 24%, జార్ఖండ్లో మైనస్ 1 శాతం, లక్షద్వీప్ లో మైనస్ 66%, పుదుచ్చేరి మైనస్ 4% తప్ప మిగతా అన్ని రాష్ట్రాలు మంచి వృద్ధి సాధించి జిఎస్టి వసూళ్ల లో దూసుకు వెళ్లాయని నిపుణులు తెలియజేశారు. ఈ విధంగా జీఎస్టీ రికార్డుల్లో భారతదేశం మంచి వృద్ధి సాధించిందని అన్నారు.అలా శత్రు దేశాలు మన దేశాన్ని ఎదగనివ్వకుండా చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇండియా జీఎస్టీ మాత్రం రోజు రోజుకి గణనీయంగా పెరుగుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: