ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంత కాలం క్రితం జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలలో తెలుగుదేశం , జనసేన , బిజెపి మూడు పార్టీలు కలిసి పొత్తులో భాగంగా పోటీ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఈ కూటమికి అదిరిపోయి రేంజ్ లో అసెంబ్లీ మరియు పార్లమెంటు స్థానాలు దక్కాయి. దానితో తెలుగుదేశం నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా కొనసాగుతూ ఉంటే , జనసేన నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి గా కొనసాగుతున్నాడు.

బి జె పి పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా మంచి మంచి మంత్రి పదవుల్లో కొనసాగుతున్నారు. ఇప్పటికి కూడా ఈ మూడు పార్టీలు చాలా మంచి గా ముందుకు సాగుతున్నారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుండి కూడా భారీ గానే సహకారం దక్కుతుంది. మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లక్ష కోట్ల అతి పెద్ద కంపెనీ రాబోతుంది. దానికి కేంద్రం ఇప్పటికే అంగీకారం కూడా తెలిపింది. అసలు విషయం లోకి వెళితే ... కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ అయినటువంటి బి పి సి ఎల్ ఆయిల్ రిఫైనరీ సంస్థను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొల్పబోతున్నారు.

బి పి సి ఎల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్ష కోట్ల తో ఈ రిఫైనరీ సంస్థను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థ కు కేంద్రం అప్రూవల్ కూడా తెలిపింది. ఇక దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఈ కంపెనీ కి చుట్టు పక్కల భారీ ఎత్తున భూములకు రేట్లు పెరగడం జరుగుతుంది అని అలాగే అనేక ఉద్యోగ అవకాశాలు అక్కడ ప్రజలకు దక్కుతాయి అని దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున లాభాలు చేకూరుతాయని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: