
అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.. 14 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవాళ్లకు ఈ విధానం అమలులో ఉంటుందంటూ తెలిపారు. అమెరికా నుంచి స్వచ్ఛందంగా వెళ్లే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని దీనిపైన స్పందించేందుకు వారికి 24 గంటల సమయం కూడా ఇస్తామంటూ తెలియజేశారు. కానీ ఈ ఆఫర్ ఎప్పటి నుంచి ఉంటుందని విషయంపై క్లారిటీ లేదు, ఈ ఆఫర్ ని ముందుగా 17 ఏళ్ల పిల్లలనుంచి ప్రారంభం అవుతుందని అధికారులు వెల్లడిస్తున్నట్లుగా అక్కడ మీడియా కథనాలు తెలియజేస్తున్నాయి.
అలాగే ట్రంప్ యంత్రాంగం ప్రకటించిన ఈ ఆఫర్ ను అక్కడ వారు ఖండిస్తున్నారు. ఇది చాలా క్రూరమైన చర్యగా భావిస్తూ పిల్లల రక్షణ చట్టాలను ఇది బలహీనపరిచేలా చేస్తుందంటూ ఆరోపణలు చేస్తున్నారు. 2021 అక్టోబర్ నుంచి తల్లితండ్రులు లేకుండానే 4 లక్షల మందికి పైగా సరిహద్దులు దాటారు వీరందరిని అమెరికా బోర్డర్ అధికారికంగా కూడా అరెస్టు చేయడం అప్పుడు సంచలనంగా మారింది. 2008 చట్టం ప్రకారం వలస ద్వారాలను స్వదేశాలకు పంపించే విధంగా రూల్స్ ఉన్నప్పటికీ ట్రంప్ యంత్రాంగం ఇవేవీ పట్టించుకోకుండా వలసదారులను స్వచ్ఛందంగా వెళ్ళిపోయేలా ఇలాంటి ఆఫర్లను ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటికే చాలా దేశాల పైన విధించిన సుంకాల,వీసాల పైన రుసుములు పెంచడం వల్ల ట్రంప్ పై చాలా మంది కోపంగానే ఉన్నారు. మళ్లీ ఇలాంటి సమయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.