కేరళ రాష్ట్రంలో బిజెపి పార్టీ సరికొత్త చరిత్రను సృష్టించింది. గత నాలుగు దశాబ్దాలుగా వామపక్షాల కంచుకోటగా ఉన్న వాటిని బద్దలు కొట్టింది. తిరువనంతపురం మేయర్ స్థానాన్ని బిజెపి పార్టీ కైవసం చేసుకుంది. బిజెపి నేత వివి.రాజేష్ మేయర్ గా ఎన్నికయ్యారు. ఈ గెలుపు రాబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిజెపి పార్టీకి మంచి బూస్ట్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ఈ విజయం కేరళ రాజకీయాలలోనే ఒక చారిత్రాత్మకమైనది అంటూ ప్రధాన నరేంద్ర మోడీ అభివర్ణించారు.


 బిజెపి, ఎన్డీఏ అభ్యర్థులకు ఓటు వేసినందుకు కేరళ ప్రజలకు కూడా ప్రధాన మోడీ కృతజ్ఞతలు తెలియజేశారు. కేరళ ప్రజలు కూడా యూడిఎఫ్, ఎల్డిఎఫ్ తో విసిగి చెందిపోయారని అందుకే తిరువనంతపురంలో బిజెపి పార్టీ సరికొత్త అధ్యాయానికి నాంది పలికిందంటూ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్  తెలియజేశారు. మలయాళీలు అవినీతి రహిత పాలన, అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారని తెలియజేస్తున్నారు.స్థానిక సంస్థల ఎన్నికలలో తమ విజయాలను దేశంలో రెండు ప్రధాన పార్టీలు అయిన బిజెపి, కాంగ్రెస్ వచ్చే ఏడాది కేరళ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల కోణంలో చూస్తున్నాయి. అటు రెండు పార్టీల మధ్య కూడా రాజకీయ మాటల యుద్ధం అయితే కొనసాగుతోంది.


కేరళలో బిజెపి యువనాయకత్వం ఎక్కువగా లీడ్ చేస్తోంది. కేరళలో బిజెపి పార్టీకి పాజిటివ్ కన్నా నెగటివ్ ఎక్కువగా ఉంటుందని అనుకుంటారు. కానీ నిన్న మొన్నటి వరకు అదే జరిగింది కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆ పార్టీ బలంగా కేరళ రాజకీయ ఉనికి పైన తమ ముద్ర వేసుకున్నట్లు కనిపిస్తోంది. కేరళలో మాస్ లీడర్స్ లేరు కానీ సురేష్ గోపి వంటి స్టార్లను మాత్రం ఉన్నారు. ఆయన వ్యక్తిగత ఇమేజ్ వల్ల లోక్సభ ఎంపీగా గెలిచారు.. అందుకే కొత్తవారిని ప్రోత్సహించే తరుణంలో బీజేపీ కనిపిస్తోంది. కేరళ రాష్ట్రం అక్షరాస్యత ఎక్కువగా ఉండడంతో యువత రాజకీయాలలో పనిచేయడానికి పెద్దగా ఇక్కడ డబ్బుతో పని ఉండదు. అందుకే కాలేజీ స్థాయిలో నుంచే ఇక్కడ యువత రాజకీయాల వైపు మక్కువ చూపుతున్నారు. ఇదే బిజెపి పార్టీకి కలిసొచ్చేలా కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని కులాలు ,హిందుత్వవాదం కూడా బిజెపి పార్టీకి కలిసి వచ్చేలా ఉన్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP