మున్సిపాలిటీలలో:
50,000 జనాభా దాటిన మున్సిపాలిటీలలో చైర్మన్ కి రూ. 19,500 రూపాయలు, డిప్యూటీ చైర్మన్ కు రూ. 9,750 రూపాయలు అలాగే కౌన్సిలర్లకు రూ. 4,450 రూపాయల చొప్పున వేతనాన్ని అందిస్తారు
ఒకవేళ 50వేల కంటే తక్కువ జనాభా ఉంటే మున్సిపాలిటీ చైర్మన్ కి రూ. 15,600 రూపాయలు, డిప్యూటీ చైర్ పర్సన్స్ కు రూ. 6,500 రూపాయలు, కౌన్సిలర్లకు రూ. 3,250 చొప్పున అందిస్తారు.
రాష్ట్ర పురపాలక చట్టం మేరకు.. మేయర్, డిప్యూటీ మేయర్, చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవి చేపట్టిన మొదట 4 ఏళ్ల వరకు విరిపైన ఎటువంటి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి వీలు ఉండదు.. నాలుగేళ్ల తర్వాత మొత్తం ఓటు ఉన్న సభ్యులలో అందులో సగం మంది సంతకాలు చేసి నోటీసు ఇచ్చి 2/3 వంతు మెజారిటీతో తీర్మానం ఆమోదిస్తే మాత్రం వారిని పదవి నుంచి తొలగించుకోవచ్చు.
మేయర్ నెలవారి జీతభత్యం రూ.65,000 రూపాయలు డిప్యూటీ మేయర్ జీతం రూ.32,500 రూపాయలు అలాగే కార్పొరేటర్ జీతం రూ.7,800 రూపాయల వరకు ఉంటుంది. అలాగే మేయర్ కు వాహన సదుపాయం కూడా ఉంటుంది వీటిని సిబ్బంది సేవల కోసం ఉపయోగించుకోవచ్చు
బాధ్యతల విషయానికి వస్తే.. పాలకవర్గం, పారిశుద్ధ్య, పర్యవేక్షణతో పాటుగా రోడ్డు, డ్రైనేజీలనిర్మాణం, అలాగే తాగునీటి సరఫరా, వీధి దీపాలు, మొక్కలు నాటడం, ప్రజల ఫిర్యాదులు పరిష్కరించడం పన్ను వసూలు వంటివి బాధ్యతలు నిర్వహిస్తారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి