తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన కొన్ని కీలకమైన హామీలను ఎన్నికలలో ప్రకటించారు. ముఖ్యంగా రైతుల పిల్లలకు మంచి విద్య అందించేందుకు తాను ఆర్థిక సహాయం కూడా చేస్తానని ,అలాగే రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ కూడా ఇచ్చారు. ఇటీవలే తమిళనాడులోని తంజావూర్ నగరంలో జరిగిన టివీకే పార్టీ కార్యక్రమం సమావేశంలో విజయ్ తన పార్టీ మేనిఫెస్టోని ఆవిష్కరించారు.


అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడుతూ మత్స్యకారులకు , భద్రతతో పాటు పారదర్శకమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు, 5 ఎకరాల భూమి ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తామని పేద రైతుల బిడ్డలకు చదువు అయ్యే ఖర్చును కూడా తమ పార్టీని భారిస్తుంది అంటూ ఎన్నికలలో హామీ ఇచ్చారు. అలాగే మరికొన్ని సంక్షేమ పథకాలను కూడా ప్రకటించి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తానని తనకు ఒక అవకాశం ఇవ్వాలని తమిళ ప్రజలను అభ్యర్థించారు.


 మిగిలిన వారందరికీ ఇవి సాధారణ ఎన్నికలలో అనిపించవచ్చు నాకు మాత్రం నన్ను ప్రేమించే ప్రజలకు ఇది ఒక భాగోద్వేగమైన ఎన్నికలని, ఈ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో మా పార్టీ జాతీయ పార్టీలతో పాటుగా రాష్ట్రంలో ఇతర పార్టీలను ఓడిస్తుందని నమ్మకం ఉంది. తాను నటించిన జననాయుగన్ సినిమా గురించి ప్రస్తావిస్తూ.. చాలామంది నాకు మద్దతుగా మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రి కూడా మద్దతు పలికారు అందుకే వారికి ధన్యవాదాలు చెప్పాను మీరు నన్ను మౌనంగా ఉంచడానికి ప్రయత్నించవచ్చు. కానీ ప్రతి ఇంట్లో కూడా ఒక విజయ్ ఉంటారు వారిని మీరు మౌనంగా ఉంచలేరు అంటూ తెలియజేశారు. చివరిగా డిఎంకె ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ తమిళనాడు ఎన్నికలలో పోటీ ప్రధానంగా విజయ్, స్టాలిన్ మధ్య ఉంటుందని, విజయ్ అంటే తమిళనాడు, తమిళనాడు  అంటే విజయ్ అన్నట్టుగా మాట్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: