మానవుని శరీరంలో పొట్టలో ఉండే గ్యాస్ బయటికి పంపడం అనేది మనం తరచూ చేసే పని అయినా దీనిని బహిరంగంగా చెప్పడానికి చాలామంది మొహమాటం పడుతూ ఉంటారు. ఈ శరీరం నుంచి బయటికి రావడం అనేది సహజమైన ప్రక్రియ అని నిపుణులు సైతం చెబుతున్నారు. దీనిని బయటికి పంపించకుండా అణిచివేయడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.


పొట్టలో నుంచి గ్యాస్ బయటకి రావడం అనేది మూత్ర విసర్జన, మలవిసర్జన, చెమట పట్టడం వంటివి సాధారణ శారీరక ప్రక్రియ లాంటిదే. అయితే ఈ గ్యాస్ ఆపుకోవడం వలన శరీరంలో పేరుకుపోయి గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో పెథలాజికల్ అనే బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి కారణం అవుతుందని ఆరోగ్య నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు.


కొన్ని సందర్భాలలో వైద్యులు కూడా ఏదైనా సర్జరీ చేసిన తర్వాత పేషెంట్లను గ్యాస్ బయటకి పోతుందా అని కూడా అడుగుతూ ఉంటారు. ఇది జీర్ణ వ్యవస్థ పనితీరుకు సంకేతమని, గ్యాస్ అధికంగా లేదా దుర్వాసనతో కూడిన గ్యాస్ రావడం అనేది మానవుని శరీరానికి అనారోగ్య సంకేతం సూచిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కానప్పుడు అలాగే అధిక ప్రోటీన్, అధిక కొవ్వు పదార్థాలు లేదా పీచు పదార్థాలు ఎక్కువగా తిన్న సమయాలలో ఇలా జరుగుతుందట.


పేగులలో ఎక్కువగా ఆహారం నిలిచిపోవడం వల్ల బ్యాక్టీరియా విచ్చిన్నం చేసి దుర్వాసనతో కూడిన గ్యాస్ ను ఉత్పత్తి చేస్తుంది. అందుకే అధిక మోతాదులలో ఏది తినకూడదు. సాధారణంగా గ్యాస్ బయటికి పంపడం ద్వారా ఎటువంటి దుర్వాసన  రానివ్వదు కనీసం రోజులో ఒకసారి లేదా రెండు రోజులకు ఒకసారి మలవిసర్జన చేయడం సర్వసాధారణం కానీ రెండు రోజులకు మించి ఎక్కువ సమయం తీసుకున్న, మలవిసర్జన కోసం ఐదు నిమిషాలకు మించి ప్రయత్నిస్తే మాత్రం మలబద్ధకంగా గుర్తించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: