ఈ మేరకు ఎస్ఎస్సి బోర్డు అధికారికంగా తెలియజేస్తూ ప్రిన్సిపల్ వాల్యుయేషన్ సూచనలను డీఈవో అధికారులకు పంపించారు. ఏపీలో పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు హిందీ పరీక్షలో రెండు మార్కులు, అలాగే ఇంగ్లీష్ పరీక్షలో ఐదు మార్కులు అదనంగా కలవనున్నాయి. జవాబు పత్రాలు మూల్యాంకనం చేసే ఉపాధ్యాయుల ఈ మార్కులను కలపనున్నారు. ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలలో ఇంగ్లీష్, హిందీ పరీక్ష పేపర్లలో మొత్తం మూడు ప్రశ్నలు అస్పష్టంగా వచ్చాయని వీటివల్ల విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే ఆయా ప్రశ్నలకు సమాధానాలు రాసిన విద్యార్థులకు ఈ మార్కులు కలపనున్నారు.
పదవ తరగతి హింది, ఇంగ్లీష్ ప్రశ్న పత్రాలలో కొన్ని పొరపాట్లు లేదా అస్పష్టత ఉన్నటువంటి ప్రశ్నలను బోర్డు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళింది. దీంతో విద్యార్థులకు నష్టం జరగకుండా గ్రేస్ మార్క్ ఇవ్వాలని ఎస్ఎస్సి బోర్డు తుది నిర్ణయం తీసుకుంది. అయితే మరో మూడు ప్రశ్నల పైన కూడా తల్లిదండ్రుల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాటికి కూడా అదనంగా మార్కులు కలపాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ బోర్డు మాత్రం ఆ ప్రశ్నలలో ఎలాంటి పొరపాట్లు లేవు అంటూ క్లారిటీ చేసింది. మరి ఎస్ఎస్సి బోర్డు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల విద్యార్థుల మార్కులు పెరుగుతాయి గ్రేడ్ కూడా మెరుగవుతుంది. విద్యార్థులు పాస్ అవ్వడంలో చాలా సహాయపడుతుందని చెప్పవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి