బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన కంగనా రనౌత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి హిమాచల్ ప్రదేశ్ లోని మండి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచింది. నిరంతరం ఎప్పుడు ఏదో ఒక విషయంలో ఈమె పేరు నిలుస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా కంగనా వ్యక్తిగత విషయం పైన సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలు జరుగుతున్నాయి. అదేమిటంటే కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ తో కంగనా రనౌత్ ప్రేమలో ఉందని త్వరలోనే వీరిద్దరి వివాహం చేసుకోబోతున్నారనే రూమర్స్ సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా వైరల్ గా మారుతున్నాయి.


అయితే ఈ విషయాలపైన కంగనా  తనదైన స్టైల్ లో స్పందిస్తూ ఘాటుగానే సమాధానాన్ని ఇచ్చింది. చిరాగ్ తో సంబంధం గురించి మాట్లాడుతూ.. తనకు చాలా కాలంగా చిరాగ్ తెలుసు, అతను నాకు అత్యంత సన్నిహితుడు మిత్రుడు అంటూ తెలియజేసింది. కేవలం మా మధ్య ఉన్నది స్నేహం మాత్రమే అని మా గురించి వస్తున్న వార్తలలో ఎలాంటి నిజము లేదని, మా మధ్య ఎలాంటి ప్రేమ గాని రొమాన్స్ గాని లేవంటూ తెలియజేసింది. గతంలో కలిసి కేవలం ఒకే ఒక సినిమాలో చేసినప్పుడే ఈ బంధం ఏర్పడిందంటూ తెలియజేసింది.


ఒకవేళ మా మధ్య నిజంగానే ప్రేమ ఉండి ఉంటే ఈపాటికి మాకు వివాహమై పిల్లలు కూడా ఉండేవారు. ఇన్నాళ్లుగా మా మధ్య ఎలాంటి మార్పు రాలేదు అది ఎప్పటికీ కేవలం స్నేహంగానే కొనసాగుతుంది అంటూ రూమర్స్ ను కోట్టిపారేసింది కంగనా రనౌత్. చిరాగ్, కంగనా ఇద్దరు కలిసి 2011లో విడుదలైన మీలే నా మీలే హాయ్ అనే చిత్రంలో కలిసి నటించారు. ఈ సినిమా తర్వాత చిరాగ్ పొలిటికల్ పరంగా ఎంట్రీ ఇవ్వగా, కంగనా మాత్రం ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్గా ఎదిగింది కానీ ప్రస్తుతం అయితే ఇద్దరు కూడా పార్లమెంటు సభ్యులు గానే కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: