ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగించే ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ లో  మనం ఫోటోలు, వీడియోలు, ఆడియో వంటి వాటిని ఉపయోగిస్తు, అలాగే ఫోన్ కాల్స్ ,వీడియో కాల్స్ వంటి వాటిని కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు తాజాగా వాట్సప్ సరికొత్త అవతారం ఎత్తబోతోంది. ఇప్పటివరకు పూర్తిగా ఉచితంగా సేవలు అందించిన వాట్సప్ ,ఇంస్టాగ్రామ్ ట్విట్టర్ తరహా లోనే సబ్స్క్రిప్షన్ పద్ధతిని ప్రవేశపెట్టడానికి సిద్ధమైనట్లుగా వినిపిస్తున్నాయి. ఇదే వాట్సప్ ప్లస్. మరి ఈ కొత్త ప్లాన్ ఏంటి డబ్బులు కట్టడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? దిని ప్రభావం సామాన్యుల పైన ఎంత ఉంటుందనే విషయం ఇప్పుడు చూద్దాం.


సబ్స్క్రిప్షన్ అనగానే వాట్సప్ ఉపయోగించాలంటే ఇకమీదట డబ్బులు కట్టాలని  అందరూ ఆలోచిస్తుంటారు. అయితే ప్రస్తుతం మనం వాడుతున్న మెసేజింగ్, వీడియో కాల్స్, వాయిస్ కాల్స్ వంటి ఫీచర్స్ ఎప్పటిలాగానే పూర్తిగానే ఉచితంగానే ఉంటాయట. అయితే ఈ సబ్స్క్రిప్షన్ అనేది కేవలం ఆప్షనల్ మాత్రమే అంటూ వాట్సప్ కంపెనీ క్లారిటీ ఇచ్చింది. సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి కొన్ని ఫీచర్స్ అందిస్తోంది. ప్రస్తుతం మనం కేవలం మూడు చాట్స్ మాత్రమే టాప్ లో ఫిన్ చేసుకోగలం కానీ సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత ఏకంగా 20 చాట్స్ వరకు మనం పిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే 18 రకాల సరికొత్త యాప్ లుక్స్ మార్చుకోవచ్చు. అలాగే మనకు నచ్చినట్టుగా వాట్సప్ ఐకాన్ ని హోమ్ స్క్రీన్ పైన మార్చుకోవచ్చు. మెసేజ్ పంపేటప్పుడు ఆకట్టుకునే విధంగా యానిమేటెడ్ స్టిక్కర్స్ పంపించుకోవచ్చు. ఒక్కో కాల్ కాంటాక్ట్ కు ప్రత్యేకమైన రింగ్టోన్స్ సెట్ చేసుకొనే సదుపాయం ఉంటుంది. ఇవే కాకుండా మరికొన్ని సెట్టింగ్స్ కూడా వెలుసుబాటులో ఉంటాయి.



ప్రస్తుతం అయితే ఈ ఫీచర్ ఇంకా టెస్టింగ్ దశలో ఉన్నది. వివిధ దేశాలలో ప్రయోగాత్మకంగా వేరువేరు ధరలు ఉంటాయట. యూరప్లో నెలకు 2.49 యూరోలు ఉండగా, మెక్సికోలో 29 డాలర్లు ఉండగా, ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.2610 వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.  ప్రతినెలా ఉంటుందని ఎప్పుడైనా కూడా వద్దనుకుంటే రద్దు చేసుకునే ఆప్షన్ కూడా కలిగే ఉంటుంది. అయితే ఈ వాట్సప్ ప్లస్ ఫీచర్ కేవలం ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉండబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: