ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు సైతం ఏపీ ప్రభుత్వం తాజాగా కీలకమైన సూచనలు చేసింది. తల్లికి వందనం కింద అందిస్తున్న రూ .15000 రూపాయలు ఈ ఏడాది అందించేందుకు బ్యాంకు ఖాతాను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత చదువుకుంటున్న ప్రతి విద్యార్థులకు అండగా ఉండేందుకు తల్లికి వందనం పథకాన్ని ప్రవేశపెట్టారు. 2024-2025 విద్యా సంవత్సరం నుండి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. అయితే ఈ పథకం ఒకటవ తరగతి నుంచి ఇంటర్ చదువుతున్న ప్రతి విద్యార్థి అర్హులే. గత ప్రభుత్వంలో ఒక్కో విద్యార్థికి మాత్రమే ఇచ్చేవారు. కానీ కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది చదివిన అంతమందికి అందిస్తోంది.



కూటమి ప్రభుత్వం అందిస్తున్న రూ .15000 రూపాయలలో రూ.13వేల రూపాయలు తల్లి అకౌంట్లో జమ చేయగా మిగిలిన రూ .2000 రూపాయలు స్కూళ్ల నిర్వహణ కోసం కేటాయిస్తున్నారు. అయితే వేసవి సెలవులు ముగిసిన వెంటనే జూన్ నెలలో కొత్త విద్యా సంవత్సరం మొదలవుతుంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో నిధులను జమ చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ డబ్బులు అకౌంట్లోకి జమ అవ్వాలి అంటే విద్యార్థి తల్లి బ్యాంకు అకౌంట్ కు ఆధార్ అనుసంధానం అవ్వాలని తెలియజేస్తోంది.


గత సంవత్సరం ఇలా బ్యాంకు అకౌంట్ కు ఆధార్ కార్డు లింక్ కాకపోవడం వల్ల చాలామంది విద్యార్థులు అర్హతలు ఉన్నప్పటికీ ఈ నిధులను పొందలేకపోయారు. అందుకే ఈసారి ముందుగానే విద్యార్థుల తల్లులను అలర్ట్ చేసింది ఏపీ ప్రభుత్వం. తమ అకౌంట్ కి ఆధార్ లింక్ ఉందో లేదో చెక్ చేసుకోవాలని ఒకవేళ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ లేకపోతే వెంటనే చేయించుకోవాలంటు తెలియజేశారు. తల్లికి వందనం పథకం అప్లికేషన్ ఏ దశలో ఉందో తెలుసుకోవాలి అంటే.. అధికారిక వెబ్సైట్ https://bm-sgsw.ap.gov.in/BM/SCHEMEOUT ద్వారా చెక్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: