కేవలం రెండు పోస్టుల కోసం ఏకంగా 700 మందికి పైగా అప్లై చేసుకున్నారు. కార్పొరేట్ ఆఫీసులలో వారానికి ఆరు రోజులలో ఉదయం9 నుంచి రాత్రి9 వరకు పని చేయాల్సి ఉంటుంది, అలాగే ఏఐ భయాలు కూడా పెరిగి ఉద్యోగులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇక ఫ్యాక్టరీలలో పని చేయడం చాలా కష్టంగా మారింది. దీంతో ఈ గొర్రెల కాపరి ఉద్యోగానికి పెద్ద చదువులు చదివిన నిరుద్యోగులు అప్లై చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జీతం కూడా ఈ ఉద్యోగానికి భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్కరికి ప్రతినెల లక్ష పదివేలకు పైగా జీతం ఇవ్వబోతున్నారు.
వీటికి తోడు వసతి, గ్రోసరీస్ కూడా ఉచితమే. చైనాలో పెద్ద యూనివర్సిటీలలో కూడా మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన వారికి సిటీలలో ఈ స్థాయిలో జీతాలు ఇస్తున్నప్పటికీ ఎక్కువగా అద్దె ఇళ్లకే సరిపోతోంది. వేసవికాలంలో 4,900 ఎకరాలు విస్తీర్ణంలో 3000 గొర్రెలను కూడా మేపాల్సి ఉంటుంది. అలాగే శీతాకాలంలో చలిలో కూడా వాటిని క్లీన్ చేస్తూ లోపలే ఉంచాలి. అయితే అన్ని విషయాలను కూడా ఓనర్ జూవో ముందే స్పష్టంగా చెబుతూ ఈ పోస్టులకు సంబంధించిన విధానాలను వివరించారు. అయినప్పటికీ కూడా చాలామంది వీటికి అప్లై చేసుకున్నారు. రెండు గంటలకు మొత్తం నలుగురికి ఉద్యోగంలోకి తీసుకున్నట్లు సమాచారం. అలాగే మరో 40 జంటలను వెయిటింగ్ లిస్టులో ఉంచినట్లు సమాచారం
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి