సిద్దిపేట, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విశ్వంభర ఫౌండేషన్, నేచర్ గ్రీన్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో, కళాశాల యాజమాన్యం మద్దతుతో మొక్కల నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఫోక్ యాక్టర్ నజీమ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే విస్తృతంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రకృతి పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, పర్యావరణ సమతుల్యత కోసం మొక్కల పెంపకం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు.
కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అయోధ్య రెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో భూభాగంలో అటవీ విస్తీర్ణం 33 శాతానికి తగ్గకుండా ఉండేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మొక్కల నాటడాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించి వాటి సంరక్షణకు కూడా కట్టుబడి ఉండాలని సూచించారు.
కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రాంగణంలో పలు రకాల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా "ఒక వ్యక్తి – ఒక చెట్టు – ఒక తరం" అనే నినాదాన్ని సంస్థ ప్రతినిధులు ప్రకటిస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ & మ్యాథమాటిక్స్ విభాగాల హెచ్‌వోడి లు
గోపాల. సుదర్శన్, మధుసూదన్, ఇన్‌స్టా ఇన్‌ఫ్లూయెన్సర్ పవన్, విశ్వంభర ఫౌండేషన్ మరియు నేచర్ గ్రీన్ సంస్థల ప్రతినిధులు వంగల సంతోష్, పోచంపల్లి. రాజేష్, రామ్ చందర్ రెడ్డి, నాగ చందర్ రెడ్డి, రాజశేఖర్, అమర్ నాథ్.లింగంపల్లి, శ్రీ వర్ధన్, కళాశాల అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి