కొన్ని రోజులుగా సాగుతున్నటువంటి ఇరుపార్టీల పాదయాత్రల్లో అప్పుడప్పుడు అపశ్రుతులు జరుగుతున్నాయి. ఎన్ని జాగత్రలు తీసుకున్న జరిగేవి జరుగకుండా ఉండడం లేదు. దీంతో పాదయాత్రల్లో పాల్గొన్నటువంటి నాయకులు కలవరపడుతున్నారు. తాజాగా వైకాపా నాయకురాలు చేస్తున్న పాదయాత్ర సందర్బంగా చోటుచేసుకున్న అపశ్రుతిలో ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
వైకాపా నాయకురాలు షర్మిల పాదయాత్ర సందర్బంగా గుంటూరు జిల్లాలో అడుగుపెట్టగానే బాచెపల్లి మండలం శ్రీనగర్ సమీపంలోని రోడ్డుపై వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. కాగా మృతుడు షర్మిల పాదయాత్రలో పాల్గొన్నటువంటి సందర్బంలో ఈ ప్రమాదం జరిగిందని అనుకుంటున్నారు. ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి అలుగుపల్లెపాడుకు చెందిన నరసింహరావుగా గుర్తించారు. అయితే తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్రలో కూడా ప్రమాద సంఘటనలు జరుగగా వైకాపా నాయకురాలు షర్మిల చేస్తున్నటువంటి మరో ప్రజాప్రస్థానంలో కూడా అపశ్రుతులు చోటుచేసుకుంటున్నాయి.
వైకాపా నాయకురాలు షర్మిల పాదయాత్ర ప్రారంభించిన కొద్దిరోజుల తర్వాత పాదయాత్ర నిర్వహిస్తుండగానే మోకాలికి తీవ్రంగా దెబ్బతగులడంతో ఆపరేషన్ కూడా జరిగింది. దీంతో చాలా రోజులు పాదయాత్ర వాయిదా పడింది. అయితే ఆరోగ్యంగా మారినటువంటి షర్మీల పాదయాత్ర గుంటూరు జిల్లాలో ప్రవేశించగానే జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. కాగా పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన సందర్బంలో ప్రమాదం జరిగిందని స్థానికులు భావిస్తున్నటువంటి సందర్బంలో అపశ్రుతిగానే చెప్పవచ్చు. కాగా షర్మిల పాదయాత్ర యధావిధిగా కొనసాగుతుంది.
ఇదిలా ఉండగా చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్రలో కూడా అపశ్రృతులు ఏర్పడుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ లో స్టేజిపై చంద్రబాబు ప్రసంగిస్తుండా స్టేజీ ఒక్కసారిగా కూలడంతో బాబు ప్రమాదం తప్పినప్పటికిని కొంత అంతరాయం కలిగింది. కాగా చంద్రబాబు పాదయాత్రలో ఉండగానే పార్టీకి చెందిన ముఖ్యనాయకుడు ఎర్రంనాయుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో పాదయాత్రను నిలిపివేసి ఎర్రన్నాయుడు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. దీంతో పాటు గుంటూరు జిల్లాలోనే జాతీయ నాయకుల విగ్రహాలకు పూలమాల వేసే సందర్బంలో మెట్లు కూలడంతో కొద్దిపాటి గాయపడ్డారు. ఇలా ఇరుపార్టీల నాయకులు పాదయాత్ర చేపట్టి ముందుకెళ్తున్నటువంటి సందర్బంలో అక్కడక్కడ అపశ్రుతులు ఏర్పడుతున్నాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: