సమైక్యాంధ్ర నినాదంతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే మంత్రి టీజీ ఈ సారి ఐఏఎస్ లపై విమర్శలతో ముందువరుసలో ఉన్నారు. ‘పని చేయని ఐఏఎస్ అధికారులను కాల్చివేయాలి. అందుకోసం రాజ్యాంగ సవరణ చేయాలి’ అంటూ గత కొన్ని రోజుల క్రితం టీజీ వ్యాక్యలు చేసిన విషయం విధితమే. ఈ వ్యాక్యల దుమారం ఆగక ముందే మరుసటి రోజు ‘పనిచేయని అధికారులు బతికి ఎంత? చస్తే ఎంత?’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే తాను అలా అనలేదని, తన మాటలను మీడియా వక్రీకరించిందని ‘కఠిన చర్యలు తీసుకోవాలని’ మాత్రమే తాను అన్నానని ముఖ్యమంత్రి కిరణ్ కు వివరణ ఇచ్చుకున్నారు.
‘ఐఏఎస్ అధికారులను కాదు...తెలంగాణకు అడ్డంకులు సృష్టిస్తున్న సీమాంధ్ర మంత్రులను కాల్చిపారేయాలి’ అంటోంది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత..
ఇక సీపీఐ నారాయణ మరో అడుగు ముందుకేసి ‘ఐఏఎస్ అధికారులను కాదు...ఆ మాటకు వస్తే మంత్రులనే కాల్చి పారేయాలి’ అన్నారు. ఇటీవల కాలంలో రాజకీయ నాయకుల నోటి నుంచి ఇలాంటి సంచలన వ్యాక్యలు, దురుసు ప్రకటనలు రావడం దురదృష్టకరం. ఈ మాటలను ప్రజాస్వామ్యవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా ఈ వాక్యలకు బీజం పోసిన మంత్రి టీజీ వెంకటేష్ పై రోజురోజు విమర్శలు పెరుగుతున్నాయి. ఉన్నతాధికారులుగా, జిల్లా కలెక్టర్లుగా ఐఏఎస్ ల పాత్ర కీలకమని పలువురు అంటున్నారు.
ఇదిలా ఉండగా టీజీ వ్యాక్యలు తమను ఎంతగానో బాధిస్తున్నాయని ఐఏఎస్ ల సంఘం సీఎంకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యాక్యలు తమను అవమానించడమేనని వారు మొరపెట్టుకున్నారు. మొదటి రోజు నోరుజారాడని అనుకున్నా...రెండో రోజు సైతం విమర్శించడాన్ని ఐఏఎస్ లు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇక తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన వ్యాక్యలపై సీమాంధ్ర సీమాంధ్ర మంత్రులు భగ్గుమంటున్నారు. తెలంగాణకు ఎవరు అడ్డుపడుతున్నారో చెప్పాలని, రాజకీయ పార్టీల్లోనే తెలంగాణ విషయంలో అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు సీమాంధ్ర నేతలను విమర్శించడం ఎంతవరకు సమంజసమని సమైక్యాంధ్ర జేఏసీ, ఇతర పార్టీలు అంటున్నాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: