ఆరుకోట్ల ఆంధ్రుల అభిమాన భాష తెలుగు అని, తెలుగుభాష తీయదనం ఇతర భాషల్లోని నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో చెప్పారు. ఇప్పటకీ భాషప్రయుక్తరాష్ట్రాలుగా విడిపోయనప్పటి నుంచి తెలుగుతల్లికి వందనం సమర్పించటం ఆంధ్రుల ఆత్మగౌరవంగా బావిస్తారు. కోస్తా జిల్లాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలతో అభివృద్ది చెందుతూ ఉన్న తెలంగాణాలోని అన్ని జిల్లాల్లోనూ తెలుగు భాషనే మాట్లాడుతున్నారు.
అసలు ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులే రాకపోతే తెలంగాణాలో ఏముంది? కూలీనాలీ చేసుకునేందుకు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లటం మినమా తెలంగాణాలో అలవాటైన పనేమిటీ? వ్యవసాయం కూడా పూర్తిస్ధాయిలో చేయలేని వాతావరణం తప్ప ! కనీసం నీటికి కూడా కరువయ్యే ఈ జిల్లాల గురించి కేసీఆర్ మాత్రమే గొప్పగా చెప్పుకోవాలి. ఖమ్మం నుంచి విజయవాడ వరకూ వెళ్ళే కూలీలను చూసి వారి బాధలను అర్థం చేసుకుని ఉంటే వేర్పాటు ఉద్యమం మానేసి ఆకలితీరే పని చేసి ఉండేవారని పలువురు ఆయన్ను విమర్శిస్తున్నారు.
తన స్వార్థం కోసం ఏర్పాటు చేసుకున్న పార్టీ ఎక్కడ కూలిపోతుందో అన్న భయంతోనే కేసీఆర్ అవాకులు, చవాకులు పేలుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆత్మవంచన మానేసి విషయాన్ని అవగతం చేసుకోలేని టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఒక కొత్త విషయం కనిపెట్టారు. అదేమిటంటే 80 ఏళ్ల క్రితం పుట్టుకొచ్చింది తెలంగాణా తల్లి అంటే అసలు ఉన్న తెలుగుతల్లి అని పరోక్షంగా అంగీకరించినట్లే అన్న విషయం కేసీఆర్ అర్థం చేసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
మతిభ్రమించినప్పడే విశ్రాంతి అవసరమని, లేనిపోని ఉద్యమాల పేరు చెప్పి యువత ప్రాణాలు తీయరాదని రాజకీయ మేథావులు కోరుతున్నారు. డిప్యూటీ స్పీకర్ గా ఉన్నప్పుడు ఎన్నిసార్లు తెలుగుతల్లి విగ్రహానికి దండవేశారో కేసీఆర్ గుర్తుకు తెచ్చుకోవాలని వారు అంటున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: