అనారోగ్యంతో మృతిచెందిన మహారాష్ట్ర మాజి ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ తో తెలుగు వారికి విడదీయని బంధం ఉంది. ఆయన ఆంధ్రప్రదేశ్ కు ఒక విధంగా అల్లుడు, అందుకే ఆయన మృతి మన రాష్ట్రంలోను విషాదాన్ని నింపింది. ఆదిలాబాద్ జిల్లా ముథోల్ నియోజకవర్గం కుబీర్ ఆయన అత్తగారు ఊరు. ఆయన మామ ఒకప్పుడు ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్. కుబీర్ కు ఆయన ప్రతిఏటా ఒక్కసారైనా భార్యా పిల్లలతో కలసి వచ్చేవారు. గత సంవత్సరం ఆయన కుమారుడు సిని నటి జెనీలియాతో వివాహం చేసుకున్న మరుసటి రోజే విలాస్ రావ్ దేశ్ ముఖ్ తన భార్య,కుమారుడు,కోడలు జెనీలియాతో సహా కుబీరుకు వచ్చి వారి కుటుంబ సాంప్రదాయాల ప్రకారం అత్తగారింట్లో ఆయన, అమ్మమ్మ ఇంట్లో ఆయన తనయుడు భార్యతో సహా ఒకరోజు ఉండి స్థానిక వారి కుల దేవుని పూజలు చేసుకుని వెల్లారు. దీంతో ఆయన మృతి వార్త కుబీర్ లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మహారాష్ట్ర సిఎంగా అయిన తర్వాత కూడా భార్యతో సహా మొదట కుబీరుకు వచ్చి పూజలు చేసారు. ఆయన మృతి వార్తతో తన అత్తగారి గ్రామంలోను, ఆయన స్మృతులను మననం చేసుకుంటుండగా,రాష్ట్రంలోని పలువురు నేతలు కూడా తీవ్ర ధిగ్భ్రాంతికి లోనయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: