హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ తో టీ మంత్రులు భేటీ అయ్యారు. ఈ నెల 30న జరపతలపెట్టిన తెలంగాణ మార్చ్ కు అనుమతి ఇవ్వాలంటూ టీ మంత్రులంతా సీఎంను కోరారు. గణేష్ నిమజ్జనం, అంతర్జాతీయ జీవవైవిధ్యసదస్సు ఉండటంతో తెలంగాణకు మార్చ్ కు అనుమతి ఇచ్చే ప్రసక్తి లేదంటూ ముఖ్యమంత్రి కిరణ్ గట్టి పట్టుదలతో ఉన్నారు. అంతే కాదు, శాంతిభద్రతల విషయంలో ఎటువంటి రాజీపడవద్దనీ ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్ ఇంఛార్జి డీజీపీ దినేష్ రెడ్డిని ఆదేశించారు. తెలంగాణ మార్చ్ ను వాయిదా వేసుకోవాలనీ సీఎం కోరారు. ఈ బాధ్యతను టీ మంత్రులకు అప్పగించారు. కానీ, తెలంగాణవాదుల నుంచీ టీ మంత్రులపై ఒత్తిళ్లు పెరిగాయి. టీ మంత్రుల విన్నపాన్ని తెలంగాణ జేఏసీ పట్టించుకోలేదు. టీ ఎంపీలు తెలంగాణ మార్చ్ లో పాల్గొంటామనీ ప్రకటించారు.
మాజీ మంత్రి కోమటి రెడ్డి మరో అడుగు ముందుకేసీ మార్చ్ లో తాను స్వచ్చందంగా పాల్గొంటాననీ, మార్చ్ లో పాల్గొననీ వారంతా తెలంగాణ ద్రోహులేననీ అంటున్నారు. ఓ వైపు సీఎం వాయిదా వేయాలంటున్నారు. మరోవైపు తమతో కలిసి రావల్సిందిగా టీ జేఏసీ,తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు మార్చ్కు అనుమతి ఇప్పించాలంటున్నారు. దీనితో టీ మంత్రులు సీఎంను కలవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. తమకు ఉన్న ఇబ్బందులను టీ మంత్రులంతా సీఎం కిరణ్ ముందు ఏకరువు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. గణేష్ నిమజ్జనం రోజున మార్చ్ ఉండటంతో అనుమతి ఇస్తే ఏదైనా అనుకోని సంఘటన జరిగితే పరిస్థితి ఏమిటనేది రాష్ర్ట ప్రభుత్వాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని భయపెట్టిస్తోంది.
మార్చ్ లో అరాచకశక్తులు చేరి హైదరాబాద్ లో విధ్వంసానికి పాల్పడవచ్చనే సమాచారం పోలీస్ యంత్రాంగం వద్ద ఉండటంతో మార్చ్ కు ఈ పరిస్థితుల్లో అనుమతి ఇవ్వడం కుదరదనీ సీఎం తెగేసి చెబుతున్నారు. దీనితో టీ మంత్రుల పరిస్థితి కడుదయనీయంగా మారింది.
మరింత సమాచారం తెలుసుకోండి: