ఒక పట్టణంలో ఒక మిఠాయి వర్తకుడు ఉండేవాడు. అతడు మిఠాయి తో పాటు వెన్న, నెయ్యి, కోవా మొదలైన వాటిని కూడా అమ్మే వాడు. వ్యాపారం చాలా బాగా సాగుతోంది. అతడి సంపాదన కూడా బాగుంది.

కొన్నాళ్లకు అతని దుకాణంలోకి ఎలుకలు ప్రవేశించాయి. అవి క్రమేపీ వందల సంఖ్యలో పెరిగి పోతున్నాయి. పదార్థాలన్నీ తినడమే కాకుండా గోడలకు బీరవాలకు, గూడా కన్నాలు పెట్టి , దుకాణమంతా పాడు చేస్తున్నాయి. వర్తకుడు ఎంతో నష్టపోతున్నాడు.

ఒకసారి మిత్రుని సలహా తో అతడొక పిల్లిని తెచ్చి దుకాణంలో పెంచసాగాడు. ఆ ఆలోచన ఫలించింది. ఈ రోజు కొన్ని ఎలుకలు, పిల్లికి పలహారమయ్యేవి.. అట్లా ఎలుకల్లో చాలా భాగం నశించి పోగా కొన్ని మాత్రమే మిగిలాయి.

ఎలుకలకు తామంతా పిల్లికి ఆహారమై తరిగి పోతున్నట్లు అర్థం అయ్యింది. తమని తాము ఎలా రక్షించుకోవాలో తెలుసుకోవడానికి ,అవన్నీ ఒక రాత్రి ఒక సభను ఏర్పాటు చేసుకున్నాయి. అందులో ఒక ముసలి ఎలుక మనమంతా, పిల్లి పీడ నుండి ఎట్లా బయటపడాలో తెలుసుకోవటానికి ఇప్పటికిక్కడ సమావేశమైనాము అంది. మిగతా ఎలుకలు అవును ఆ పిల్లి మనల్ని బ్రతకనివ్వటం లేదు. కన్నం లో నుంచి బయటకు వస్తే చాలు , మీదపడి చంపేస్తోంది. లోపలే దాగుంటే మల మల మాడిచావాలి. అన్నాయి.. అప్పుడా ముసలి ఎలుక చప్పుడు చేయకుండా వచ్చి ఆ పిల్లి మన మీద దాడి చేసి చంపుతోంది. అందుచేత అది వస్తుందని తెలియడానికి మనం ఏదైనా ఉపాయం ఆలోచించాలి. అంది వెంటనే ఒక కుర్ర ఎలుక లేచి దాని మెళ్ళో గంట కడితే సరి అంది.. మిగతా ఎలుకలన్ని వెంటనే ఆ ఆలోచన బాగుంది. కానీ పిల్లికి గంట కట్టేదెవరు..?అన్నాయి

ఈలోగా అక్కడికి పిల్లి రావటం చూసింది. ముసలి ఎలుక.. ఒక్క పరుగున కన్నం లోకిపోయి దూరింది. వెంటనే మిగతా ఎలుకలన్ని గూడా అక్కడినుండి పారిపోయాయి. ఎవరికైనా సరే నీతులు చెప్పడం మానివేయాలి.. ఎందుకంటే మాటలు సులభంగా చెప్పవచ్చు.. కానీ చేతలు చాలా కష్టంగా ఉంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: