అనగనగా ఒక ఊరిలో సూరయ్య అనే కూరగాయల వ్యాపారి ఉండేవాడు.చుట్టుపక్కల గ్రామాల నుంచి కూరగాయలతో పాటు పాలు, నెయ్యి సేకరించి పెద్ద ఊళ్లకు వెళ్లి రవాణా చేసి చాలా డబ్బులు పొందేవాడు.. పక్క ఊరిలో రాములమ్మ అనే పాడి గేదెలు కలిగిన ఒక స్త్రీ ఉండేది. ఆమె కూడా తన గేదెల నుంచి వచ్చిన పాల నుంచి తీసిన వెన్న తీసుకొచ్చి సూరయ్య కు ఇచ్చేది. సూరయ్య దగ్గర కిలో కూరగాయలు తీసుకొని ఆ తర్వాత నెయ్యి ఇచ్చి వెళ్ళేది..

కొన్ని రోజులు గడిచిన తరువాత సూరయ్య గ్రామాధికారి కి రాములమ్మ మీద ఫిర్యాదు చేశారు.. అయ్యా నేను రాములమ్మ దగ్గర వెన్న కొంటాను..కొన్న ప్రతిసారి  వంద గ్రాముల బరువు  వెన్న తక్కువగా ఉంటుంది..సరిగ్గా తూచడంలేదు.. దయచేసి ఆమె చేస్తున్న మోసానికి తగిన శిక్ష వేసి నాకు నష్టపరిహారం ఇప్పించండి అని అన్నాడు.


గ్రామాధికారి రాములమ్మను పిలిపించి.. సూరయ్య చేసిన ఫిర్యాదు గురించి చెప్పి వివరణ అడిగాడు.. ఇక అప్పుడు అమాయకంగా ముఖం పెట్టిన రాములమ్మ.. స్వామి ఆ సంగతి నాకు తెలియదు.. నా దగ్గర తూకపు రాళ్ళు లేవు.. అందుకే నేను సూరయ్య దగ్గర ముందుగా కిలో కూరగాయలు కొనేదాన్ని. ఆ బరువు సరితూగిన వెంటనే అతనికి నెయ్యి ఇస్తున్నాను అంతే ఏదైనా కిలోనే కదా అని అన్నది రాములమ్మ.

దానితో గ్రామాధికారికి విషయం అర్థం అయ్యింది. సూరయ్య ఆమెను మోసం చేయాలని చూశాడు..కానీ తానే మోసపోయాడు.. గ్రామాధికారి మాట్లాడుతూ.. రాములమ్మ చెప్పినదాన్ని బట్టి చూస్తే ముందు నువ్వే ఆమెను మోసం చేయడానికి ప్రయత్నించావని తెలుస్తోంది.. లెక్క సరిపోయింది కాబట్టి ఆమె నీకు నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలాంటి పనులు మాని న్యాయంగా వ్యవహరించు అంటూ సూరయ్యను మందలించి పంపించేశాడు గ్రామాధికారి అందుకే ఎవరైనా సరే ఎదుటివారిని మోసం చేయకూడదు

మరింత సమాచారం తెలుసుకోండి: