గంగాధరం అనే ఒక కూరగాయల వ్యాపారి దగ్గర సత్యరాజు అనే యువకుడు కొత్తగా పనిలో చేరాడు. సత్య రాజు ఎంతో నిజాయితీగా పనిచేస్తూ.. యజమాని మెప్పు పొందాడు. అయితే సత్య రాజుకు కాస్త కోపం ఎక్కువ..ఎవరైనా కూరగాయలు కొనడానికి వచ్చి .. వాళ్లు బేరమాడుతూ విసిగిస్తే "వెళ్లండి వెళ్లండి! మీరేం కొంటారు అంటూ కసురు కొనేవాడు. కొనడానికి వచ్చిన వాళ్ళని ఇలా కసురుకోవడం, కోప్పడటం లాంటివి మానుకోమని గంగాధరం ఎంతగానో చెప్పి చూశాడు. కానీ సత్య రాజు ఇవేమీ వినిపించుకోలేదు.

ఒకరోజు ఆ ఊరి పెద్ద వీరభద్రయ్య పని మనిషి తో సత్య రాజు దురుసుగా మాట్లాడటంతో వీరభద్రయ్య స్వయంగా వచ్చి గంగాధరాన్ని నానా మాటలు అని పోయాడు. ఇక ఊరుకొని లాభం లేదని గంగాధరం సత్యరాజునీ పనిలో నుంచి వెంటనే తీసేసాడు. దిగాలుపడి పోయిన సత్య రాజు రెండు రోజుల తరువాత తిరిగి గంగాధరం దగ్గరకు వచ్చి తనను పనిలోకి తీసుకోమని, ఇక తప్పు చేయని అని  బతిమాలడం మొదలు పెట్టాడు. అయితే గంగాధరం అతను చెప్పేది వినిపించుకోకుండా ఏయ్ చెప్తుంటే మనిషివి కాదు.. ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ అరిచాడు గంగాధరం.

తనను కుక్కను అదిరించినట్లుగా కరుకుగా మాట్లాడటంతో సత్యరాజు మనసు బాగా  కలుక్కుమన్నది. అతనీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా తలదించుకొని వెనక్కి తిరిగాడు. వెంటనే గంగాధరం అతన్ని "ఒరేయ్ ఇలారా!"అంటూ దగ్గరకు పిలిచాడు.సత్య రాజు వెనక్కి వచ్చి యజమాని ఎదురుగా నిలబడ్డాడు. అప్పుడు గంగాధరం "ఇప్పుడు నీకు అర్థం అయిందా? ఒక మనిషితో మరొక మనిషి మర్యాదగా.. గౌరవంగా .. మాట్లాడకుండా కసురుకొంటే ఆ మనిషి ఎంత బాధ పడతాడో అన్నాడు సౌమ్యంగా..నిజంగానే సత్య రాజుకు ఆ బాధ అనుభవంలోకి వచ్చింది. చేతులు జోడిస్తూ ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసి వచ్చింది అయ్యా.. అన్నాడు..ఇప్పుడు నేను నిన్ను నమ్మ గలను వెంటనే పనిలోకి చేరు అన్నాడు గంగాధరం శాంతంగా.. ఏదైనా సరే అనుభవిస్తేనే తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: