
అక్కడ జరిగిన సమావేశంలో షరీఫ్ కూడా పాల్గొన్నారు. పుల్వామా, పఠాన్ కోఠ్ లాంటి దాడుల తర్వాత ఇండియా పాక్ లు తమ రాయబారులను ఆయా దేశాల్లో నిషేధించాయి. ఇలా నిషేధించిన కారణంగా పాక్ తో భారత్ కు ఎలాంటి సంబంధాలు లేవు. మన దేశంలో మన సైనికులపై దాడులు చేస్తూ పరోక్షంగా తీవ్ర వాదులకు శిక్షణనిస్తుంటుంది పాక్ ఆర్మీ. పాక్ ప్రభుత్వం కూడా పాక్ ఆర్మీ కనుసన్నల్లోనే పని చేస్తుంటుంది. ఇప్పుడు పాక్ తమ రాయబారిని భారత్ లో నియమించేందుకు ఆసక్తి కనబరుస్తోంది.
అంటే పరోక్షంగా భారత్ ను సాయం చేయమని అడిగేందుకు ప్రయత్నం చేస్తోందన్న మాట. కానీ పాకిస్థాన్ ను అసలు నమ్మకూడదని, పాక్ ను నమ్మడం వల్ల కలిగే ఇబ్బందులు అన్ని ఇన్నీ ఉండవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాక్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభం లో కూరుకుపోయి కనీసం గోధుమ పిండి కూడా దొరకని పరిస్థితి ఉంది. ఇలాంటి తరుణంలో పాక్ ను గనక ఆదుకుంటే చివరికి భారత్ కు వెన్నుపోటు పొడవటం ఖాయమని హెచ్చరిస్తోంది. కాబట్టి పాకిస్థాన్ ను అసలు నమ్మవద్దని నిపుణులు జాగ్రత్తలు చెబుతున్నారు.