కొంతమంది సినీ ఇండస్ట్రీలోకి వచ్చి తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వుంటారు. అయితే వీరు నటించింది కేవలం ఒకటి రెండు చిత్రాలే అయినప్పటికీ, ఎప్పటికీ ప్రేక్షకులు మరిచిపోని విధంగా నటించి, ఎప్పుడు తలచుకున్నా కళ్ళముందు కదిలి నటిస్తూ ఉంటారు. అలాంటి వారిలో యశో సాగర్ కూడా ఒకరు. తెలుగు సినీ ఇండస్ట్రీలో కేవలం ఒక సినిమాలో నటించినప్పటికీ, ప్రేక్షకులను బాగా మెప్పించాడు.ఇక  కన్నడ భాషలో ఎన్నో చిత్రాలలో నటించిన సోమ కుమారుడు యశో సాగర్. యశో సాగర్ అసలు పేరు భరత్.


తెలుగు లో కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు . ఈ చిత్రంలో హీరోగా నటించి తన కామెడీతో ప్రేక్షకులను బాగా మెప్పించాడు. ఇందులో స్నేహఉల్లాల్ హీరోయిన్ గా నటించింది. అయితే హీరో హీరోయిన్ల మధ్య సాగే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. అలా  మొదటి సినిమాతోనే తెలుగులో మంచి విజయాన్ని అందుకున్నాడు యశోసాగర్.


అయితే ఈయన ఈ సినిమా తర్వాత  మరణించాడు.కర్ణాటక సమీపంలో తుముకూరు జిల్లా సిరార్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యశో సాగర్ మరణించాడు. తన స్నేహితుడితో కలిసి యశోసాగర్ ముంబై  నుంచి బెంగళూరు వెళ్తున్న సమయంలో తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇక ఈ ప్రమాదంలో యశో సాగర్ తో పాటు అతని పక్కనే ఉన్న డ్రైవర్ కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మిత్రుడు కోమాలోకి వెళ్ళినట్లు సమాచారం. అయితే వేగంగా యశోసాగర్ కారు నడుపుతుండగా, ఎదురుగా వస్తున్న ఒక వాహనాన్ని తప్పించబోయి, పక్కనే ఉన్న డివైడర్ ను  ఢీకొన్నాడు. అలా కారు మొదటి భాగం పూర్తిగా నుజ్జయింది.ఇక  2012 డిసెంబర్ 19 వ తేదీన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.


అంతకు ముందు రోజు స్నేహఉల్లాల్ పుట్టినరోజు సందర్భంగా ముంబై కి వెళ్లి అక్కడ ఆమె పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరిపి, ఫుల్లుగా మద్యం సేవించారాట. ఇక స్నేహఉల్లాల్ ఎంత చెప్పినా వినకుండా.. అక్కడ నుంచి తిరిగి బెంగళూరు వస్తున్న సమయంలో బెంగళూరులో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మరణించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: