టీమిండియా చైనామెన్ బౌలర్  కుల్దీప్ యాదవ్ అరుదైన  ఘనత సొంతం చేసుకున్నాడు. వైజాగ్ వేదికగా   వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో వన్డే  లో వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు  పడగొట్టి హ్యాట్రిక్ ను ఖాతాలో వేసుకున్నాడు కుల్దీప్.  తద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో  రెండు సార్లు  హ్యాట్రిక్ వికెట్లను  సాధించిన  మొదటి  భారత బౌలర్ గా  రికార్డు సృష్టించాడు. 
 
ఇంతకుముందు కుల్దీప్  2017 లో కోల్ కత్తా లో ఆస్ట్రేలియా తో జరిగిన  వన్డే మ్యాచ్ లో కెరీర్ లో మొదటి సారి  హ్యాట్రిక్ ను సాధించాడు.  ఇక ఇప్పటివరకు  భారత్ తరపున వన్డే ల్లో కుల్దీప్ కాకుండా కేవలం ముగ్గురు బౌలర్లు మాత్రమే  హ్యాట్రిక్ ను సాధించారు.  అందులో భాగంగా 1987లో నాగపూర్ లో న్యూజిలాండ్  పై చేతన్ శర్మ , 1991లో కోల్ కత్తా లో  శ్రీలంక పై కపిల్ దేవ్ అలాగే 2019 సౌతాంఫ్టన్ లో ఆఫ్ఘానిస్తాన్ పై  షమీ హ్యాట్రిక్ వికెట్ల ను సాధించారు. 
 
ఇక   వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో  వన్డే లో  టీమిండియా  గెలుపు  ముగింట నిలిచింది. 388పరుగుల భారీ లక్ష్యం తో బరిలోకి దిగిన విండీస్  జట్టు  ఒకానొక దశలో లక్ష్యాన్ని ఛేదించేలా కనబడింది. అయితే 30ఓవర్ నుండి  క్రమం తప్పకుండా  వికెట్లు  కోల్పోవడం తో వెస్టిండీస్ విజయం పై ఆశలు వదిలేసుకుంది. విండీస్ గెలవాలంటే  55బంతుల్లో ఇంకా 125పరుగులు చేయాలి చేతిలో  ఇంకా ఒక వికెట్ మాత్రమే వుంది. ప్రస్తుతం క్రీజ్ లో కీమో పాల్ , కాట్రేల్ వున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: