కెప్టెన్ విరాట్ కోహ్లీ మరియు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ ఆడడం ఇప్పటికీ... నిన్న జరిగిన కొలంబో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. మొదటి నుంచి శ్రీలంక జట్టుపై ఆధిపత్యం చేస్తూ వస్తున్న శిఖర్ ధావన్ సేన అవలీలగా గెలుపొందింది. కెప్టెన్ గా శిఖర్ ధావన్... మ్యాచ్ ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళితే... నిర్ణీత 50 ఓవర్లలో శ్రీలంక జట్టు 262 పరుగులు చేసి తొమ్మిది వికెట్లు కోల్పోయింది. శ్రీలంక జట్టులో కెప్టెన్ షనక తో సహా ఓపెనర్లు రాణించడంతో... గౌరవప్రదమైన స్కోర్ రాబట్టగలిగింది. ఇక 263 పరుగుల లక్ష్య ఛేదన కోసం బరిలో దిగిన టీం ఇండియా... మొదటి నుంచి మంచి ఆటను కనబరిచింది.

 కేవలం 36.3 ఓవర్లలో మాత్రమే 263 పరుగుల లక్ష్యాన్ని చే దించింది టీమిండియా. ఇండియా బ్యాటింగ్ వివరాల్లోకి వస్తే ఓపెనర్ గా దిగిన శిఖర్ ధావన్ తన సత్తా చాటాడు. 95 బంతుల్లో ఏకంగా 86 పరుగులు చేసి  టీమిండియాకు విజయాన్ని అందించాడు ధావన్. అటు దాహంతో ఓపెనర్ గా దిగిన పృథ్వీ షా కూడా మొదట్లో చెలరేగాడు. 24 బంతుల్లోనే 9 ఫోర్లు బాది పరుగుల వద్ద అవుటయ్యాడు. చివర్లో వచ్చిన మనీష్ పాండే మరియు సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. దీంతో టీమిండియా అవలీలగా శ్రీలంక జట్టుపై విజయం సాధించింది.

 మొదటి వన్డే గెలుపుతో సిరీస్ లో 1-0 లీడింగ్ ను సాధించింది టీమిండియా.  ఇదిలా ఉండగా.. కెప్టెన్ గా వ్యవహరించిన శిఖర్ ధావన్ టీమిండియా కు మంచి విజయాన్ని సాధించడమే కాక తన ఖాతాలో మరో రికార్డు వేసుకున్నాడు. వన్డే మ్యాచుల్లో ఆరు వేల పరుగుల మైలురాయిని గబ్బర్... దాటేశాడు. దీంతో పదివేల పరుగుల మైలురాయిని దాటిన టీమిండియా ఆటగాళ్లలో... శిఖర్ ధావన్ 14వ స్థానాన్ని దక్కించుకున్నాడు. దీంతో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా.... శ్రీలంక వన్డే శిఖర్ ధావన్ కు మంచి వేదిక అయ్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి: