కొలంబో వేదికగా జరిగిన రెండో వన్డేలో శ్రీలంక జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించింది. టీమిండియా చేజింగ్ లో తడబడిన అప్పటికీ టేలండర్లు ఆదుకోవడంతో.... విజయం అనివార్యమైంది. ఇక మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక దాటిగా ఆడి... నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 275 పరుగులు చేసింది. ఇక శ్రీలంక బ్యాటింగ్ వివరాల్లోకి వస్తే అవిష్కా ఫెర్నాండో 50 పరుగులు మరో ఓపెనర్ వినోద్ 36 పరుగులు, చరిత్ అసలంక 65 పరుగులు చేసి జట్టును ఆదుకున్నారు. 

శ్రీ లంక టీం బ్యాటింగ్ బాగా ఆడటంతో రీచ్ అయింది. ఇటు భారత బౌలింగ్ వివరాల్లోకి వస్తే మొదటి మ్యాచ్లో విఫలమైన భువనేశ్వర్ కుమార్ ఈ మ్యాచ్ లో... అద్భుతమైన ఆట తీరును కనబరిచాడు. 54 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు భువనేశ్వర్. అలాగే దీపక్ చాహర్ 2 స్పిన్నర్ చహల్ మూడు వికెట్లు తీసి శ్రీలంక జట్టును కట్టడి చేశారు. ఇక 275 పరుగుల లక్ష్యంతో దిగిన టీమిండియా ఆరంభం నుంచి తడబడుతూ వచ్చింది. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలం కావడంతో కష్టాల్లో పడింది టీమిండియా. 

అయితే టీం ఇండియా పేస్బౌలర్ దీపక్ చాహర్ మరియు భువనేశ్వర్ కుమార్.... అద్భుతమైన ఆట కనబర్చడంతో టీమిండియా గెలుపు సాధ్యమైంది. ఇక టీం  ఇండియా బ్యాటింగ్ వివరాల్లోకి వస్తే మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ 53 పరుగులు, దీపక్ చాహర్ 69 పరుగులు మరియు భువనేశ్వర్ 19 పరుగులు చేశారు. షేవింగ్ కు దిగిన టీమిండియా.... 49.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరింది. ఈ విజయంతో... సిరీస్ ను  కైవసం చేసుకుంది టీమిండియా. మూడు వన్డే ల సిరీస్ ల్ భాగంగా టీం ఇండియా.. శ్రీలంక టూర్ వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే..సిరీస్ ను  కైవసం చేసుకుంది ఇండియా టీం. 

మరింత సమాచారం తెలుసుకోండి: