శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసేందుకు టీమిండియా రెడీ అయ్యింది. లంకతో జరుగుతున్న 3 వన్డేలో సిరీస్‌ను ఇప్పటికే 2-0తో సొంతం చేసుకున్న భారత జట్టు... ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ఆఖరి వన్డేలో కూడా సూపర్ విక్టరీ సాధించాలని పట్టుదలతో ఉంది. నామమాత్రపు మ్యాచ్‌లో ప్రయోగాలపై దృష్టిపెట్టిన గబ్బర్‌ సేన... చివరి పోరులో భారీ విజయం కోసం ప్రాక్టీస్ చేస్తోంది. అటు సొంత గడ్డపై జరుగుతున్న సిరీస్‌లో వరుస ఓటములతో కుదేలైన లంక టీమ్... చివరి మ్యాచ్‌లో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని తాపత్రయపడుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో లంక ఇచ్చిన టార్గెట్‌ను టీమిండియా ఊదేసింది. చివరి బ్యాట్స్‌మెన్‌ కూడా లంక బౌలర్లతో చెడుగుడు ఆడుకున్నాడు.

మూడో వన్డేలో టీమ్‌లో భారీ మార్పులకు గబ్బర్‌ సేన రెడీ అయ్యింది. మరో కొత్త ఓపెనర్‌ను బరిలోకి దించేందుకు ప్లాన్‌ చేస్తోంది టీమిండియా. వరల్డ్‌ కప్ టార్గెట్‌గా నయా ప్లేయర్స్‌ను సిద్ధం చేస్తోంది. ఇందుకోసం లంక సిరీస్‌ను ఓ ప్రాక్టీస్‌గా వాడుకుంటోంది. పృథ్వీ షా స్థానంలో దేవదత్‌ పడిక్కల్‌, రుత్‌రాజ్‌ గైక్వాడ్‌లో ఒకరికి అవకాశం దక్కొచ్చు. టీ20 ప్రపంచకప్‌నకు షాను దృష్టిలో పెట్టుకుంటే మాత్రం తప్పించడం కష్టం.

అటు శ్రీలంక జట్టు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. మొదటి రెండు వన్డేల్లో ఓడినప్పటికీ... రెండో మ్యాచ్‌లో మాత్రం కొంత బెటర్‌ ప్లేతో విమర్శలకు చెక్ పెట్టింది. అయితే మూడో వన్డే ఓడి సిరీస్‌ను జీరోతో ఓడితే మాత్రం... సొంతగడ్డపై మరిన్ని విమర్శలు ఎదుర్కొవాల్సిందే లంకేయులు. ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో, మినోద్‌ భనుక మంచి ఆరంభాలే ఇస్తున్నారు. ఆ శుభారంభాలను మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ భారీ స్కోరుగా మలచలేక పోతున్నారు. మధ్య ఓవర్లలో ఎక్కువ బంతులు తింటూ వికెట్లు పారేసుకుంటున్నారు. కెప్టెన్‌ దసున శనక, ధనంజయ డిసిల్వా ఫర్వాలేదనిపిస్తున్నా ఎక్కువ పరుగులు చేయాల్సిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: