ఐదు టెస్టుల సిరీస్ లో  భాగంగా ఇంగ్లాండ్ జట్టుతో టీమిండియా 4వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ... ఓ అరుదైన ఘనతను సాధించాడు. ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ వేసిన 18 ఓవర్ చివరి బంతిని ఫోర్ కొట్టిన విరాట్ కోహ్లీ... ఇంటర్నేషనల్ క్రికెట్ లో అతి వేగంగా 23 వేల పరుగులు పూర్తి చేసిన మొదటి బ్యాట్స్మెన్ గా చరిత్ర సృష్టించాడు. మొదట్లో ఈ అరుదైన రికార్డు క్రికెట్ దిగ్గజం,  లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరుతో ఉండేది. 

లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్... 522 ఇన్నింగ్స్ లో ఈ రికార్డును నెలకొల్పగా... విరాట్ కోహ్లీ మాత్రం 440 మ్యాచ్ ల్లో 498 లలో  ఈ రికార్డును సృష్టించాడు. అయితే ఈ రికార్డు లో ఏకంగా 70 సెంచరీలు మరియు 116 హాఫ్ సెంచరీలు చేశాడు విరాట్ కోహ్లీ. ఇదిలా ఉండగా ఈ రికార్డును పూర్తి చేయటానికి.. ఆస్ట్రేలియా డాషింగ్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కు ఏకంగా 544 ఇన్నింగ్స్ అవసరం వచ్చాయి. అలాగే సౌత్ ఆఫ్రికా మాజీ ఆల్ రౌండర్ జాక్ కలిస్ 551 ఇన్నింగ్స్ లలో ఈ ఘనతను సాధించాడు. ఇక వీళ్ల తర్వాత శ్రీలంక జట్టు ఆటగాడు, మాజీ కీపర్ కుమార సంగక్కర 568 ఇన్నింగ్స్ లు,  టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ 576 ఇన్నింగ్స్ లు , శ్రీలంక జట్టు మాజీ కెప్టెన్ జయవర్ధనే 645 ఇన్నింగ్స్ లు ఆడి ఈ అరుదైన రికార్డును సాధించారు.

ఇది ఇలా ఉండగా.... నాలుగో టెస్టు మ్యాచ్ లో లో టీమిండియా జట్టు కేవలం 191 పరుగులకే కుప్పకూలింది. ఇక ఇండియా ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ 50 పరుగులు మరియు శార్దుల్ ఠాకూర్ 57 పరుగులు చేసి  టీమిండియాను ఆదుకున్నారు. టీమిండియా లోని మిడిల్ ఆర్డర్ మరియు టాప్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది. టీమ్ ఇండియా ఆల్ అవుట్ కావడంతో ఇంగ్లండ్ తన మొదటి ఇన్నింగ్స్ ను ఆరంభించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది. ఇవాళ మధ్యాహ్నం 2వ రోజు ఆట ప్రారంభం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: