యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఉత్కంఠభరితంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో లీగ్ మ్యాచ్ లు చేరామ దశకు చేరుకోవడమే ఇందుకు కారణం. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన వెంటనే ఐసీసీ 2021 ప్రపంచ కప్ ఉండటంతో ఈ సీజన్ ను త్వరగా ముగించడం కోసమని వీకెండ్ డేస్ లో రెండు మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్ తో మొదటి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడింది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన తర్వాత ఛేజింగ్ తీసుకున్న ఢిల్లీ 130 పరుగుల టార్గెట్ తో తమ ఇన్నింగ్స్ ను ఆరంభించింది. అయితే పిచ్ బౌలింగ్ కు అనుకూలంగా ఉండటంతో మ్యాచ్ మొదట్లోనే ఢిల్లీ కి షాక్ ఇచ్చారు ముంబై బౌలర్లు. ఆ జట్టు ఓపెనర్లు పృథ్వీ షా 6 పరుగుల వధే పెవిలియన్ కు చేరగా మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 8 పరుగులే చేసి రన్ ఔట్ అయ్యాడు. వన్ డౌన్ లో వచ్చిన స్మిత్ కూడా 9 పరుగులే చేసి నిరాశ పరిచాడు. కానీ ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ మాజీ కెప్టెన్ శ్రేయర్ అయ్యర్ కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించారు. ఆ సమయంలోనే పంత్ వెనుదిరిగిన అయ్యర్ చివరి వరకు నాట్ ఔట్ గా నిలిచాడు. చివరి లో అశ్విన్ కూడా 20 పరుగులు చేయడంతో ఢిల్లీ మరో 5 బంతులు ఉండగానే 4 వికెట్ల తేడాతో ఈ ఐపీఎల్ సీజన్ లో 9 వ విజయాన్ని తమ ఖాతాలో వేసుకొని మొత్తం 18 పాయింట్లతో చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత ఐపీఎల్ 2021 ప్లే ఆఫ్ లో బెర్త్ ఖాయం చేసుకున్న జట్టుగా నిలిచింది. ఇక ఈ పరాజయం తరవాత ముంబై కూడా పంజాబ్, కోల్ కత్తా లతో సమానంగా నిలిచింది. కాబట్టి ఐపీఎల్ 2021 లో ప్లే ఆఫ్స్ ఆఖరి బెర్త్ కు పోటీ ఎక్కువైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: