యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్లో ఈరోజు షార్జా అంతర్జాతీయ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు కీలకమైన మ్యాచ్ లో తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకొని రాజస్థాన్ రాయల్స్ జట్టును మొదట బ్యాటింగుకు పంపించాడు. అయితే మొదట బ్యాటింగ్ కు వచ్చిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ముంబై బౌలర్లు చుక్కలు చూపించారు. ఆ జట్టులో గత మ్యాచ్లో చెలరేగిన ఓపెనర్లలో ఎవిన్ లూయిస్ 24 పరుగులు చేయగా యశస్వి జైస్వాల్ 12 పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సంజు శాంసన్ శివమ్ దూబే చెరో మూడు పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నారు. అలాగే గ్లెన్ ఫిలిప్స్ నాలుగు పరుగులు చేసి బోల్డ్ కాగా ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన డేవిడ్ మిల్లర్ 15 పరుగులు చేస్తే రాహుల్ తెవాటియా 20 బంతుల్లో 12 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇక ఆ వెంటనే శ్రేయస్ గోపాల్ గోల్డెన్ డక్ కాగా చేతన్ సకారియా ఆరు పరుగులు చేశారు. అయితే చివర్లో ముస్తఫిజుర్ రహమాన్ ఒక్క సిక్స్ కొట్టడంతో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. ఇక ముంబై బౌలర్లలో నాథన్ కౌల్టర్-నైల్ నాలుగు వికెట్లు పడగొట్టగా జేమ్స్ నీషమ్ మూడు వికెట్లు తీశాడు. అలాగే బుమ్రా రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే ముంబై ఇండియన్స్ 91 పరుగులు చేస్తే చాలు. అయితే ఈ మ్యాచ్లో విజయం సాధించిన జట్టే ప్లే ఆఫ్స్ రేస్ ముందుకు వెళ్తుంది అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ షార్జా మైదానం బౌలింగ్ కు బాగా సహకరిస్తుంది కాబట్టి రాజస్థాన్ బౌలర్లు ఏ విధంగా రాణిస్తారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: