ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ లో ఫైనల్ కు చేరుకున్న మొదటి జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. అయితే ఐపీఎల్ 2021 ఈరోజు జరిగిన మొదటి క్వాలిఫైర్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ వచ్చిన వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓపెన్ పృథ్వీ షా(60), కెప్టెన్ పంత్ (51) అర్థ శతకాలతో రాణించడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 172 పరుగులు చేసింది. అలాగే ఐదు వికెట్లు కోల్పోయింది. ఇక 173 పరుగులు లక్ష్యంతో వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ మొదటి ఓవర్ లోనే షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ డుప్లెసిస్ ఒక పరుగు చేసి అవుటయ్యాడు.

కానీ ఆ తర్వాత రాబిన్ ఊతప్ప తో కలిసి మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ రెండో వికెట్ కు 110 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలోనే 63 పరుగులు చేసిన ఊతప్ప అవుట్ అయిన తర్వాత వచ్చిన శార్దుల్ ఠాకూర్ గోల్డెన్ డక్ కాగా అంబటి రాయుడు మొక్క పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు.  ఆ వెంటనే గైక్వాడ్ 70 పరుగులు చేసి అవుటయ్యాడు. ఇక చివరి ఓవర్లో చెన్నై సూపర్ కింగ్స్ కు 13 పరుగులు కావాల్సి ఉండగా... ఆ ఓవర్ మొదటి బంతి కి మోయిన్ అలీ 16 పరుగులు చేసి వెనుదిరిగాడు. కానీ ఆ తర్వాత ది బెస్ట్ ఫినిషర్ గా పేరొందిన ఎంఎస్ ధోని వరుస బౌండరీలు బాదాడు. దాంతో బౌలర్ నాలుగో బంతో విద్ వేసాడు. కాబట్టి మళ్లీ వేసిన నాలుగవ బంతికి ధోని మరొక ఫోర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించడమే కాకుండా ఐపీఎల్ చరిత్రలో 9వ సారి తన చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఫైనల్లోకి చేర్చాడు. ఇక మ్యాచ్లో ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ క్వాలిఫైయర్ 2 కి వచ్చింది. రేపు జరగబోయే ఎలిమినేటర్స్ మ్యాచులో ఎవరు విజయం సాధిస్తే వారితో ఢిల్లీ పోటీ పడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: