ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021లో ఈరోజు జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కు వచ్చిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు దేవదత్ పాడిక్కల్, విరాట్ కోహ్లీ మొదటి వికెట్కు 49 పరుగులు జోడించారు, ఆ తర్వాత 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద దేవదత్ పాడిక్కల్ అవుటయ్యాడు. ఆ తర్వాత గత మ్యాచ్లో అదరగొట్టిన శ్రీకర్ భరత్ బ్యాటింగ్ కు వచ్చి 16 బంతుల్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే భరత్ అవుట్ అయిన కాసేపటికే కెప్టెన్ విరాట్ కోహ్లీ 39 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇక ఆ తర్వాత బెంగళూరు జట్టు స్కోరు బోర్డు నెమ్మదించింది. విరాట్ కోహ్లీ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన గ్లేన్ మాక్స్ వెల్ 15 పరుగులు, ఏబీ డివిలియర్స్ 11 పరుగులు, షాబాజ్ అహ్మద్ 13 పరుగులు చేశారు. అయితే చివరి ఓవర్లో హర్షల్ పటేల్ ఒక బౌండరీ బాదాడు. అలాగే బౌలర్ వేసిన వైడ్స్ కారణంగా మొత్తం 12 పరుగులు బెంగళూరు జట్టుకు వచ్చాయి. దాంతో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 138 పరుగుల చేసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు .

అయితే బెంగళూరు జట్టు దెబ్బతీసింది కేకేఆర్ బౌలర్ సునీల్ నరైన్ ఒక్కడే. ఈ మ్యాచ్లో నరైన్ నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు తీయగా, లాకీ ఫెర్గూసన్ రెండు వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ ఎలిమినేటర్ లో విజయం సాధించాలంటే కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 139 పరుగులు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ మ్యాచ్ జరుగుతున్న మైదానం బౌలింగ్ కు బాగా సహకరిస్తుంది. కాబట్టి ఈ సీజన్లో చెలరేగుతున్న రాయల్ చాలెంజర్స్ బౌలర్లను ఎదుర్కొని ఈ లక్ష్యాన్ని ఛేదించడం నైట్ రైడర్స్ కష్టమైన పని. ఇక ఈ ఎలిమినేటర్ మ్యాచ్లో ఎవరు విజయం సాధించి క్వాలిఫైయర్ 2 లోకి ఎవరు వస్తారు అనేది చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: