భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు యూఏఈ వేదికగా నిర్వహిస్తున్న 2021 ఐసీసీ క్రికెట్ టీ 20 ప్రపంచ కప్ లో ఈ రోజు మన భారత జట్టు కేన్ విలియమ్సన్ సారధ్యంలోని న్యూజిలాండ్ జట్టుతో తలపడుతుంది. అయితే ఈ రెండు జట్ల కు ప్రపంచ కప్ లో ఇది రెండో మ్యాచ్. భారత్, న్యూజిలాండ్ రెండు జట్లు తమ మొదటి మ్యాచ్ పాకిస్థాన్ జట్టు తో ఓడిపోయాయి. కాబట్టి ఈ మ్యాచ్ రెండు జట్ల కు చాలా కీలకం. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కేన్ విలియమ్సన్ బౌలింగ్ తీసుకొని మన భారత జట్టు ను మొదటి బ్యాటింగ్ కు పంపిస్తున్నాడు. అయితే గత మ్యాచ్లో ఓడిపోవడంతో ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని అనుకుంటున్నా టీం ఇండియా రెండు మార్పులతో వస్తుంది. ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ స్థానంలో ఇషాన్ కిషన్... భువనేశ్వర్ కుమార్ స్థానంలో శార్దుల్ ఠాకూర్ తుది జట్టులోకి వచ్చారు. అయితే ఈ మ్యాచ్లో ఏ జట్టు అయితే ఓడిపోతుందో ఆ జట్టుకు సెమీస్ కు వెళ్ళడం అత్యంత కఠినతరం అయిపోతుంది. అందువల్ల ఇందులో విజయం సాధించాలని రెండు జట్లు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనేది అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

భారత్ : ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ( c ), రిషబ్ పంత్( wk ), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా

కివీస్ : మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్(  c), జేమ్స్ నీషమ్, డెవాన్ కాన్వే( w ), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌతీ, ఆడమ్ మిల్నే, ట్రెంట్ బౌల్ట్

మరింత సమాచారం తెలుసుకోండి: